వెన్నెల సాక్షిగా
పున్నమి చంద్రుడు కృష్ణా నదిలో పుష్కరస్నానం చేస్తున్నాడు. అలల మీద వెన్నెల శత సహస్ర రూపాలుగా ప్రతిబింబిస్తూ ఆనందతాండవం చేస్తోంది. స్నానానికి వెళ్తున్న నన్ను ఆమె ఆకర్షించింది.
ఆమెకి సుమారు ముప్పయ్ అయిదు సంవత్సరాలుంటాయి. అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆమె ఒంటిని హత్తుకున్న దుస్తులు ఆమె ఒంపుల్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాయి. అయితే, నన్ను ఆకర్షించింది ఆమె ఒంపు సొంపులు కాదు. ఆమె శిరోజాలు! అవును. ఆమె శిరోజాలు!!
ఒత్తుగా ఎత్తయిన ఆమె పిరుదుల్ని దాటి వున్నాయి. అంతే అయితే ఇంతలా ఇదైపోయేవాడ్ని కాదు.
ఆమె కురులు తెల్లగా వున్నాయి అంటే ముగ్గు బుట్టలాగానో, దూది గుట్టల్లాగానో కాదు. అదో విధమైన సొగసుతో, చమత్కారంతో వెన్నెలని సవాలు చేస్తూ మెరిసిపోతున్నాయి. ఆమె ఒక మెట్టు మీద కూర్చుని స్తంభానికి ఆనుకుని కళ్లు మూసుకుంది. తల తుడుచుకోలేదు. కనీసం జుట్టు విదుల్చుకోలేదు. పాపం టవలు తెచ్చుకోలేదేమో... సాయం చేద్దామన్న ఉద్దేశ్యం కన్నా ఆమెని పలకరించాలని దగ్గరగా వెళ్ళాను.
"ఏమండీ టవలు కావాలా” అని అడిగాను. ఆమె కళ్ళు తెరవలేదు. అసలు నా మాట కూడా వినబడినట్టు లేదు.
అంతలో నా భుజాలమీద ఒక చెయ్యి పడడం, నన్ను పక్కకి లాగేయడం. తృటిలో జరిగిపోయాయి. ఆమె తాలూకు వ్యక్తేమో అని భయం వేసి "అది కాదండీ... పాపం టవలు..." అంటూ గొణిగాను................
వెన్నెల సాక్షిగా పున్నమి చంద్రుడు కృష్ణా నదిలో పుష్కరస్నానం చేస్తున్నాడు. అలల మీద వెన్నెల శత సహస్ర రూపాలుగా ప్రతిబింబిస్తూ ఆనందతాండవం చేస్తోంది. స్నానానికి వెళ్తున్న నన్ను ఆమె ఆకర్షించింది. ఆమెకి సుమారు ముప్పయ్ అయిదు సంవత్సరాలుంటాయి. అప్పుడే స్నానం చేసి వస్తున్న ఆమె ఒంటిని హత్తుకున్న దుస్తులు ఆమె ఒంపుల్ని ప్రత్యేకంగా ప్రకటిస్తున్నాయి. అయితే, నన్ను ఆకర్షించింది ఆమె ఒంపు సొంపులు కాదు. ఆమె శిరోజాలు! అవును. ఆమె శిరోజాలు!! ఒత్తుగా ఎత్తయిన ఆమె పిరుదుల్ని దాటి వున్నాయి. అంతే అయితే ఇంతలా ఇదైపోయేవాడ్ని కాదు. ఆమె కురులు తెల్లగా వున్నాయి అంటే ముగ్గు బుట్టలాగానో, దూది గుట్టల్లాగానో కాదు. అదో విధమైన సొగసుతో, చమత్కారంతో వెన్నెలని సవాలు చేస్తూ మెరిసిపోతున్నాయి. ఆమె ఒక మెట్టు మీద కూర్చుని స్తంభానికి ఆనుకుని కళ్లు మూసుకుంది. తల తుడుచుకోలేదు. కనీసం జుట్టు విదుల్చుకోలేదు. పాపం టవలు తెచ్చుకోలేదేమో... సాయం చేద్దామన్న ఉద్దేశ్యం కన్నా ఆమెని పలకరించాలని దగ్గరగా వెళ్ళాను. "ఏమండీ టవలు కావాలా” అని అడిగాను. ఆమె కళ్ళు తెరవలేదు. అసలు నా మాట కూడా వినబడినట్టు లేదు. అంతలో నా భుజాలమీద ఒక చెయ్యి పడడం, నన్ను పక్కకి లాగేయడం. తృటిలో జరిగిపోయాయి. ఆమె తాలూకు వ్యక్తేమో అని భయం వేసి "అది కాదండీ... పాపం టవలు..." అంటూ గొణిగాను................© 2017,www.logili.com All Rights Reserved.