ఇదే 'నా' వైద్యం
అడపా రామకృష్ణ
సెల్: 9505269091
డాక్టర్ సందీప్ గార్ని కలిసి పదిరోజులైంది. వారితో అస్తమానం పనిలేక పోయినా స్నేహ పూర్వకంగా కలవడం అలవాటు. సాయంత్రం నాలుగైతే చాలు, రోడ్డు మీద వున్న రెండు గదులు క్లినిక్ తలుపులు తెరుచు కుంటాయి. దుమ్ము దులిపి దీపం వెలిగించి, టోకెన్ పెట్టుకొని పేషంట్ల కోసం చూస్తుంటాడు.
డాక్టరు సందీప్కు వైద్య వృత్తిలో పాతికేళ్ళ అనుభవం వుంది. రద్దీగా వున్న నగరంలో ఆ చివర ఈ చివర రెండు క్లినిక్స్కు సారధ్యం వహిస్తున్నాడు. డాక్టర్ క్లినిక్క్క ఎంత ఆలస్యంగా వచ్చినా అప్పటివరకు పేషంట్స్ నిరీక్షిస్తూనే వుంటారు.
ఆ రోజు నేను వెళ్ళేసరికి, కుర్చీలు, నాలుగు వైపులవున్న బల్లల నిండా పేషంట్స్ కూర్చొని వున్నారు. వారితో తోడుగా వచ్చిన వారున్నారు. రద్దీగానే వుంది.
కాంపౌండరుని కలిసి, చిన్న నవ్వు నవ్వి టోకెన్ తీసుకొని, కొంచెం ఖాళీగా వున్న చోటును చూసుకొని కూర్చొని అందరివైపు ఒక మారు దృష్టి సారించాను. ఒకర్నొకరు సీరియస్గా చూసుకుంటూ, ఇక నిశ్శబ్దం భరించలేక సణుగుడు మొదలు పెట్టారు.
ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషంట్స్ అందరిలో ఓ దుర్గుణం వుంది. ఏ డాక్టరు దగ్గరకైతే వస్తారో, వారిని తప్పించి మిగతా డాక్టర్లపై తమ అక్కసంతా మాటల్లో చూపిస్తుంటారు. శారీరక బాధలతో సతమతమవుతున్న వారంతా వారి మానసిక వ్యధల్ని మరొకరితో పాలుపంచుకోవడంలో ఎంతో తృప్తి పడుతుంటారు. కథా కుసుమాలు.................
ఇదే 'నా' వైద్యం అడపా రామకృష్ణ సెల్: 9505269091 డాక్టర్ సందీప్ గార్ని కలిసి పదిరోజులైంది. వారితో అస్తమానం పనిలేక పోయినా స్నేహ పూర్వకంగా కలవడం అలవాటు. సాయంత్రం నాలుగైతే చాలు, రోడ్డు మీద వున్న రెండు గదులు క్లినిక్ తలుపులు తెరుచు కుంటాయి. దుమ్ము దులిపి దీపం వెలిగించి, టోకెన్ పెట్టుకొని పేషంట్ల కోసం చూస్తుంటాడు. డాక్టరు సందీప్కు వైద్య వృత్తిలో పాతికేళ్ళ అనుభవం వుంది. రద్దీగా వున్న నగరంలో ఆ చివర ఈ చివర రెండు క్లినిక్స్కు సారధ్యం వహిస్తున్నాడు. డాక్టర్ క్లినిక్క్క ఎంత ఆలస్యంగా వచ్చినా అప్పటివరకు పేషంట్స్ నిరీక్షిస్తూనే వుంటారు. ఆ రోజు నేను వెళ్ళేసరికి, కుర్చీలు, నాలుగు వైపులవున్న బల్లల నిండా పేషంట్స్ కూర్చొని వున్నారు. వారితో తోడుగా వచ్చిన వారున్నారు. రద్దీగానే వుంది. కాంపౌండరుని కలిసి, చిన్న నవ్వు నవ్వి టోకెన్ తీసుకొని, కొంచెం ఖాళీగా వున్న చోటును చూసుకొని కూర్చొని అందరివైపు ఒక మారు దృష్టి సారించాను. ఒకర్నొకరు సీరియస్గా చూసుకుంటూ, ఇక నిశ్శబ్దం భరించలేక సణుగుడు మొదలు పెట్టారు. ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషంట్స్ అందరిలో ఓ దుర్గుణం వుంది. ఏ డాక్టరు దగ్గరకైతే వస్తారో, వారిని తప్పించి మిగతా డాక్టర్లపై తమ అక్కసంతా మాటల్లో చూపిస్తుంటారు. శారీరక బాధలతో సతమతమవుతున్న వారంతా వారి మానసిక వ్యధల్ని మరొకరితో పాలుపంచుకోవడంలో ఎంతో తృప్తి పడుతుంటారు. కథా కుసుమాలు.................© 2017,www.logili.com All Rights Reserved.