బ్రహ్మసూత్రాలని న్యాయప్రస్థానం అనడంలో అర్ధం, ఉపనిషత్తుల్లో అనేక సందర్భాల్లో అనేక శభ్ధాలని, వివిధ అర్ధాలలో వాడారు. వాటికి ఏవిధంగా ఏకవాక్యత చెప్పాలి అని నిర్ణయించడానికి వచ్చిన సూత్రాలే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలనేవి జీవుడు, జగత్తు, దేవుడు అనే మూడింటిని గురించి పూర్తిగా పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయడానికి తోడ్పడే సూత్రాలు. సూత్రం అంటేనే తక్కువ అక్షరాలతో ఎలాంటి సందేహానికి అవకాశం లేకుండా అర్ధాన్ని చెప్పే వాక్యాలు. ఇలాంటి వాక్యాలు 555. వీటిలో అనేకాంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ అంశాలన్నీ ఒక్కొక్క టాపిక్ అనుకుంటే ఇందులో అలాంటి టాపిక్స్ 192 వున్నాయి. ఒక్కొక్క టాపిక్ కు అధికరణం అని పేరు. ఒకో అధికరణంలో ఒకే సూత్రం వుండగా కొన్ని అధికరనాలలో 10, 15 వరకు కూడా సూత్రాలున్నాయి. అంటే ఒక విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఉపనిషత్తుల్లో వివిధ స్థానాల్లో వున్న వాక్యాలను తీసుకుని ఆ వాక్యాలను ఏ విధంగా సమన్వయం చేయాలి, చేసి ఏవిధంగా అర్ధం చెప్పాలని నిర్ధారణ చేసే స్థానం అధికరణం. ఇది ఒక న్యాయస్థానం లాంటిది. ఒక విషయంలో పూర్వపక్షం, దానిలో వున్న వాదనలన్నీ తీసుకుని వాటిని విశ్లేషించి, తుదిగా ఒక సిద్ధాంతంచేయడం దీనిలో మనం చూసే ప్రక్రియ.
ప్రస్తుతం గ్రంధంలో శ్రీ అప్పరసు విజయరామారావుగారు బ్రహ్మసూత్రాలకి సులభ వ్యావహారికభాషలో సంగ్రహంగా వ్యాఖ్యానం చేశారు. వీరు తమ ఉప్పోద్ఘాతంలోనే బ్రహ్మసూత్రాలపై వున్న వివిధ భాష్యాల గురించి ప్రస్తావిస్తూ ఏ సిద్ధాంతాన్ని సమర్ధించడం కాని, ఖండించడం కాని చేయడం లేదని వివరించారు. ఇది గ్రంథమంతటా కనిపిస్తుంది. అయినా ప్రస్తావనలోనే జీవుడు, జగత్తు ఈ రెండింటి సత్యాన్ని అంగీకరించడం ద్వారా చేతనం, జడం అనే రెండూ నిజమే అనే ద్వైత వాదాన్ని అంగీకరించినట్లు కనిపిస్తుంది. అలాగే జ్ఞానం, కర్మ(యజ్ఞయాగాదులు) రెండింటినీ అంగీకరించడం కూడా దీనికి నిదర్శనం.
ప్రతి సూత్రానికీ ప్రతిపదార్ధం తాత్పర్యం రాయడం వల్ల సూత్ర సుత్రార్ధవివరణ చాలా చక్కగా జరిగింది. వివరణ చాలా క్లుప్తంగా వుంది. బ్రహ్మసూత్రాల గురించి పాఠకునికి అవగాహన కల్పించడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది.
- అప్పరసు విజయరామారావు
బ్రహ్మసూత్రాలని న్యాయప్రస్థానం అనడంలో అర్ధం, ఉపనిషత్తుల్లో అనేక సందర్భాల్లో అనేక శభ్ధాలని, వివిధ అర్ధాలలో వాడారు. వాటికి ఏవిధంగా ఏకవాక్యత చెప్పాలి అని నిర్ణయించడానికి వచ్చిన సూత్రాలే బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలనేవి జీవుడు, జగత్తు, దేవుడు అనే మూడింటిని గురించి పూర్తిగా పూర్తిస్థాయిలో విశ్లేషణ చేయడానికి తోడ్పడే సూత్రాలు. సూత్రం అంటేనే తక్కువ అక్షరాలతో ఎలాంటి సందేహానికి అవకాశం లేకుండా అర్ధాన్ని చెప్పే వాక్యాలు. ఇలాంటి వాక్యాలు 555. వీటిలో అనేకాంశాలు ప్రస్తావించబడ్డాయి. ఈ అంశాలన్నీ ఒక్కొక్క టాపిక్ అనుకుంటే ఇందులో అలాంటి టాపిక్స్ 192 వున్నాయి. ఒక్కొక్క టాపిక్ కు అధికరణం అని పేరు. ఒకో అధికరణంలో ఒకే సూత్రం వుండగా కొన్ని అధికరనాలలో 10, 15 వరకు కూడా సూత్రాలున్నాయి. అంటే ఒక విషయాన్ని నిర్ధారణ చేయడానికి ఉపనిషత్తుల్లో వివిధ స్థానాల్లో వున్న వాక్యాలను తీసుకుని ఆ వాక్యాలను ఏ విధంగా సమన్వయం చేయాలి, చేసి ఏవిధంగా అర్ధం చెప్పాలని నిర్ధారణ చేసే స్థానం అధికరణం. ఇది ఒక న్యాయస్థానం లాంటిది. ఒక విషయంలో పూర్వపక్షం, దానిలో వున్న వాదనలన్నీ తీసుకుని వాటిని విశ్లేషించి, తుదిగా ఒక సిద్ధాంతంచేయడం దీనిలో మనం చూసే ప్రక్రియ. ప్రస్తుతం గ్రంధంలో శ్రీ అప్పరసు విజయరామారావుగారు బ్రహ్మసూత్రాలకి సులభ వ్యావహారికభాషలో సంగ్రహంగా వ్యాఖ్యానం చేశారు. వీరు తమ ఉప్పోద్ఘాతంలోనే బ్రహ్మసూత్రాలపై వున్న వివిధ భాష్యాల గురించి ప్రస్తావిస్తూ ఏ సిద్ధాంతాన్ని సమర్ధించడం కాని, ఖండించడం కాని చేయడం లేదని వివరించారు. ఇది గ్రంథమంతటా కనిపిస్తుంది. అయినా ప్రస్తావనలోనే జీవుడు, జగత్తు ఈ రెండింటి సత్యాన్ని అంగీకరించడం ద్వారా చేతనం, జడం అనే రెండూ నిజమే అనే ద్వైత వాదాన్ని అంగీకరించినట్లు కనిపిస్తుంది. అలాగే జ్ఞానం, కర్మ(యజ్ఞయాగాదులు) రెండింటినీ అంగీకరించడం కూడా దీనికి నిదర్శనం. ప్రతి సూత్రానికీ ప్రతిపదార్ధం తాత్పర్యం రాయడం వల్ల సూత్ర సుత్రార్ధవివరణ చాలా చక్కగా జరిగింది. వివరణ చాలా క్లుప్తంగా వుంది. బ్రహ్మసూత్రాల గురించి పాఠకునికి అవగాహన కల్పించడానికి ఈ గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది. - అప్పరసు విజయరామారావు© 2017,www.logili.com All Rights Reserved.