ఇది, ధర్మ సందేహ నివృత్తికి మార్గం...
శ్రీ గురుభ్యోనమః
- ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం
పరాశరమహర్షిచే వ్రాయబడినది పరాశరస్మృతి గ్రంథము. ఈ స్మృతిగ్రంథానికి మాధవాచార్యులవారు. అత్యంత ప్రామాణికమైన మాధవీయమను వ్యాఖ్య వ్రాసిరి. పరాశరమాధవీయమనే ఈ ధర్మశాస్త్ర గ్రంథం స్మృతి ప్రస్థానానికి సంబంధించినది. వేదాంతశాస్త్రములో ప్రస్థానత్రయమను ప్రసిద్ధవ్యవహారముతో మూడు ప్రస్థానములు కలవు. అవి 1. శ్రుతి ప్రస్థానం 2. స్మృతి ప్రస్థానం 3. సూత్ర ప్రస్థానం అని. వేదాలు, ఉపనిషత్తులు మొ||నవి శ్రుతి ప్రస్థానానికి సంబంధించినవి. మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, గౌతమ ధర్మసూత్రాలు, పారాశరస్మృతి, భగవద్గీత మొదలగునవి స్మృతి ప్రస్థానానికి సంబంధించినవి. వ్యాసమహర్షి ప్రణీతములకు బ్రహ్మసూత్రాలు సూత్ర ప్రస్థానానికి సంబంధించినవి. మానవుడు అనుసరించవలసిన ధర్మమార్గాన్ని బోధించేవే ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మమార్గాన్ని బోధించడం ద్వారా పరమపురుషార్ధమైన మోక్షసాధకాలు ఈ స్మృతిప్రస్థాన గ్రంథాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని ఆరు వేదాంగాలు చెప్పబడ్డాయి. ధర్మశాస్త్రగ్రంథాలు కల్పమనే వేదాంగానికి సంబంధించినది.
"వేదోక 2 ఖిలో ధర్మమూలమ్" అని చెప్పబడింది. ఎన్ని స్మృతిగ్రంథాలు ఎన్నెన్ని ధర్మాలను బోధించినా వాటికన్నింటికి వేదమే మూలము. అన్ని జన్మలలోను మానవజన్మ పూర్వజన్మ సుకృతం చేతనే లభిస్తుంది. అధర్మమార్గాన్ని విడచి మానవుడు ధర్మమార్గాన్ని అనుసరించినప్పుడే ఆ జన్మకు సార్ధకత సిద్ధిస్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మము అని మనకు బోధించేవే వేదాలు. వేదాలు పరమ ప్రమాణాలు. అవి అపౌరుషేయాలు, స్వతఃప్రమాణాలు కూడా. వేదాల్లో నిర్దేశించబడింది మనందరికీ శిరోధార్యం. వేదాల్లో ఇలాగే ఎందుకు చెప్పబడింది. ఇలాగ ఎందుకు చెప్పబడలేదు అన్న ప్రశ్నకు తావు లేదు. వేదాలను ఎవరూ రచించలేదు. అవి పరమేశ్వరుని చేత స్మరింపబడ్డాయి. అందువల్లనే ఎన్ని కల్పాలు మారినా వేదాలు నిత్యాలు, సార్వకాలికాలు. ఎన్నివేల సంవత్సరాలు గడచినా కూడా వేద ప్రతిపాదిత ధర్మంలో మాత్రం మార్పు ఉండదు. ఇది వైదిక సిద్ధాంతం.
అయితే వేదాలను చదివి ధర్మశాస్త్ర విషయాలను తెలుసుకోవడం అంత సులభమైన పనికాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందువల్లనే ఆయా ఋషులు సర్వమానవోద్ధరణ కాంక్షతో ఆయా ధర్మశాస్త్ర గ్రంథాలను మనకి అందించారు. ఈ స్మృతి గ్రంథాలన్నీ శ్రుతులను అంటే వేదాలను అనుసరించే ధర్మప్రతిపాదనను చేస్తాయి. కాళిదాసు రఘువంశంలో "శ్రుతేరివార్ధం స్మృతిరన్వగచ్ఛత్" అని చెప్పాడు. స్మృతులు శ్రుతులను అనుసరించే ఉంటాయని అర్ధం, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ ధర్మసూత్రాలు, ధర్మసింధువు,.................
ఇది, ధర్మ సందేహ నివృత్తికి మార్గం... శ్రీ గురుభ్యోనమః - ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం పరాశరమహర్షిచే వ్రాయబడినది పరాశరస్మృతి గ్రంథము. ఈ స్మృతిగ్రంథానికి మాధవాచార్యులవారు. అత్యంత ప్రామాణికమైన మాధవీయమను వ్యాఖ్య వ్రాసిరి. పరాశరమాధవీయమనే ఈ ధర్మశాస్త్ర గ్రంథం స్మృతి ప్రస్థానానికి సంబంధించినది. వేదాంతశాస్త్రములో ప్రస్థానత్రయమను ప్రసిద్ధవ్యవహారముతో మూడు ప్రస్థానములు కలవు. అవి 1. శ్రుతి ప్రస్థానం 2. స్మృతి ప్రస్థానం 3. సూత్ర ప్రస్థానం అని. వేదాలు, ఉపనిషత్తులు మొ||నవి శ్రుతి ప్రస్థానానికి సంబంధించినవి. మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, గౌతమ ధర్మసూత్రాలు, పారాశరస్మృతి, భగవద్గీత మొదలగునవి స్మృతి ప్రస్థానానికి సంబంధించినవి. వ్యాసమహర్షి ప్రణీతములకు బ్రహ్మసూత్రాలు సూత్ర ప్రస్థానానికి సంబంధించినవి. మానవుడు అనుసరించవలసిన ధర్మమార్గాన్ని బోధించేవే ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మమార్గాన్ని బోధించడం ద్వారా పరమపురుషార్ధమైన మోక్షసాధకాలు ఈ స్మృతిప్రస్థాన గ్రంథాలు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని ఆరు వేదాంగాలు చెప్పబడ్డాయి. ధర్మశాస్త్రగ్రంథాలు కల్పమనే వేదాంగానికి సంబంధించినది. "వేదోక 2 ఖిలో ధర్మమూలమ్" అని చెప్పబడింది. ఎన్ని స్మృతిగ్రంథాలు ఎన్నెన్ని ధర్మాలను బోధించినా వాటికన్నింటికి వేదమే మూలము. అన్ని జన్మలలోను మానవజన్మ పూర్వజన్మ సుకృతం చేతనే లభిస్తుంది. అధర్మమార్గాన్ని విడచి మానవుడు ధర్మమార్గాన్ని అనుసరించినప్పుడే ఆ జన్మకు సార్ధకత సిద్ధిస్తుంది. ఏది ధర్మము, ఏది అధర్మము అని మనకు బోధించేవే వేదాలు. వేదాలు పరమ ప్రమాణాలు. అవి అపౌరుషేయాలు, స్వతఃప్రమాణాలు కూడా. వేదాల్లో నిర్దేశించబడింది మనందరికీ శిరోధార్యం. వేదాల్లో ఇలాగే ఎందుకు చెప్పబడింది. ఇలాగ ఎందుకు చెప్పబడలేదు అన్న ప్రశ్నకు తావు లేదు. వేదాలను ఎవరూ రచించలేదు. అవి పరమేశ్వరుని చేత స్మరింపబడ్డాయి. అందువల్లనే ఎన్ని కల్పాలు మారినా వేదాలు నిత్యాలు, సార్వకాలికాలు. ఎన్నివేల సంవత్సరాలు గడచినా కూడా వేద ప్రతిపాదిత ధర్మంలో మాత్రం మార్పు ఉండదు. ఇది వైదిక సిద్ధాంతం. అయితే వేదాలను చదివి ధర్మశాస్త్ర విషయాలను తెలుసుకోవడం అంత సులభమైన పనికాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదు. అందువల్లనే ఆయా ఋషులు సర్వమానవోద్ధరణ కాంక్షతో ఆయా ధర్మశాస్త్ర గ్రంథాలను మనకి అందించారు. ఈ స్మృతి గ్రంథాలన్నీ శ్రుతులను అంటే వేదాలను అనుసరించే ధర్మప్రతిపాదనను చేస్తాయి. కాళిదాసు రఘువంశంలో "శ్రుతేరివార్ధం స్మృతిరన్వగచ్ఛత్" అని చెప్పాడు. స్మృతులు శ్రుతులను అనుసరించే ఉంటాయని అర్ధం, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ ధర్మసూత్రాలు, ధర్మసింధువు,.................© 2017,www.logili.com All Rights Reserved.