భూమిక
శ్రీ కైలాసమానస సరోవర పుణ్య ప్రదేశములు జగతీతలములో రమణీయతకు అద్వితీయములు. వాటి అనుపమ సౌందర్యముతో ఘనిష్ట పరిచయము పొందుట మన పైగల ఒక జాతీయ ఋణము. మన పూర్వీకులు తమ ఈ కర్తవ్యమును సరిగ గ్రహించిరి. వారు తమ చరణ తపస్సుతో ఈ స్థానములను దర్శించిరి. తమ వాణి విభూతితో వీని మహాత్యమును గానము చేసి కృతకృత్యులైరి. తమ ఉదార భావములతో సువర్ణరజిత వర్ణముల రూపము నింపి ఈ హిమకుండిత ప్రదేశములను అమర సౌందర్య దివ్య ప్రతీకలవలె మన సాహిత్యమును చిరప్రతిష్టితము గావించిరి. శ్రీ కైలాసమానస సరోవరములతో గల మన సౌహార్ధ భావము నేటిదికాదు. బహు ప్రాచీనమైనది. ఏదియో దేవ యుగంలో గంగాయమునలు తమ కర్మనిష్టయుతమగు మట్టి యొక్క సుందర తీరములను పడుగు పేకలుగా అల్లి ఉత్తరాపథ భూమిని వ్యాప్తి చేయనారంభించెను. ప్రథమ పర్యాయము అంతర్వేది రాజహంసలు తమ వార్షిక యాత్రల పరంపరలో ఆకాశములో రెక్కలు సారించి మానస సరోవర తీరముపై వెళ్ళి దిగినవి. అప్పటి నుండి కైలాసముతో మనసఖ్య భావము ప్రారంభమయ్యెను. ఆ సంబంధము నేటి వరకు అదే రీతిని అవిచలితముగానున్నది.
మన శరత్కాలీన నిర్మలాకాశపు ఒడిని ప్రతి సంవత్సరము క్రౌంచ పక్షులు కలరవము చేయుచు పంక్తులను నేడు కూడా నింపుచునే యున్నవి. ఆ సమయమున అది శ్రీ కైలాస మానస సరోవరముల కుశల సందేశములను తీసికొని మరలుచున్నవి. మనము మన బాల్యము నుండి వీటిని చూచితిమి మరియు బాల్యమందలి తరంగిత స్వరములతో ఆనందముతో వాటికి స్వాగతము కూడా యిచ్చియుంటిమి. కైలాస మానస స్మృతిని మనకై సస్యశ్యామలముగా నుంచుచున్న వ్యోమ మందలి ఆ యాత్రీకుల ఉపకారమును మన్నించవలెను.
ఇదే విధమగు కృతజ్ఞత ప్రస్తుత యాత్రా గ్రంధరచయిత యెడల మన మనస్సులో వచ్చుచున్నది. ప్రాచీన గ్రంధముల ప్రకారము యాత్రలు రెండు విధములుగనున్నవి. ఒకటి శుక మార్గము. రెండవది పిపీలికా మార్గము. శుకాదులగు పక్షులు ఒక స్థానము నుండి మరియొక స్థానమునకు ఎగిరి వెళ్ళును. కాని అవి తమ వెనుక ఏ పదచిహ్నములను వదలియుంచవు. కాని చీమ ఒక్కొక్క కాలు ఎత్తుచు శ్రమపూర్వకమగు మార్గమును పూర్తి చేయును. దాని యొక్క పూర్తి కాలిబాట స్పష్టముగా మనకు కనబడును. ఈ విధముగానే అనేక మంది భారతీయులు ప్రతి సంవత్సరము హిమాలయములందలి దుర్గమ మార్గములను దాటి కైలాస మానస సరోవరముల దర్శనమునకు వెళ్ళుచున్నారు. కానీ శ్రీ స్వామి ప్రణవానంద యొక్క కైలాస దర్శనము ఒక స్తుత్య సంఘటన. వారు తమ కైలాస యాత్రను పిపీలికా గతిని మనముందు స్పష్టముగా, మూర్తివంతముగా చేయుటకు సుందరమైన స్తుత్యమైన ప్రయత్నము గావించిరి. కైలాస మానస సరోవర దర్శనముచే వారికెట్టి స్పూర్తి లభించినదో, వారి మనస్సుకు, నేత్రములకెట్టి స్వర్గీయ సుఖము లభించినదో అందులో దానిని వారందరకు పంచియిచ్చిరి. వారు తాము పొందిన ప్రసాదమును పంచి యిచ్చుటకు తమతో కలియమని ఉత్సాహముతో ప్రేరేపించిరి. శ్రీ కైలాస యాత్రపై ఇంత పూర్ణప్రశస్త పథప్రదర్శక గ్రంధము ఏ భాషలోను ఇంతవరకు లిఖింపబడియుండలేదు. పుస్తకమందలి మూడవ, నాల్గవ.................
భూమిక శ్రీ కైలాసమానస సరోవర పుణ్య ప్రదేశములు జగతీతలములో రమణీయతకు అద్వితీయములు. వాటి అనుపమ సౌందర్యముతో ఘనిష్ట పరిచయము పొందుట మన పైగల ఒక జాతీయ ఋణము. మన పూర్వీకులు తమ ఈ కర్తవ్యమును సరిగ గ్రహించిరి. వారు తమ చరణ తపస్సుతో ఈ స్థానములను దర్శించిరి. తమ వాణి విభూతితో వీని మహాత్యమును గానము చేసి కృతకృత్యులైరి. తమ ఉదార భావములతో సువర్ణరజిత వర్ణముల రూపము నింపి ఈ హిమకుండిత ప్రదేశములను అమర సౌందర్య దివ్య ప్రతీకలవలె మన సాహిత్యమును చిరప్రతిష్టితము గావించిరి. శ్రీ కైలాసమానస సరోవరములతో గల మన సౌహార్ధ భావము నేటిదికాదు. బహు ప్రాచీనమైనది. ఏదియో దేవ యుగంలో గంగాయమునలు తమ కర్మనిష్టయుతమగు మట్టి యొక్క సుందర తీరములను పడుగు పేకలుగా అల్లి ఉత్తరాపథ భూమిని వ్యాప్తి చేయనారంభించెను. ప్రథమ పర్యాయము అంతర్వేది రాజహంసలు తమ వార్షిక యాత్రల పరంపరలో ఆకాశములో రెక్కలు సారించి మానస సరోవర తీరముపై వెళ్ళి దిగినవి. అప్పటి నుండి కైలాసముతో మనసఖ్య భావము ప్రారంభమయ్యెను. ఆ సంబంధము నేటి వరకు అదే రీతిని అవిచలితముగానున్నది. మన శరత్కాలీన నిర్మలాకాశపు ఒడిని ప్రతి సంవత్సరము క్రౌంచ పక్షులు కలరవము చేయుచు పంక్తులను నేడు కూడా నింపుచునే యున్నవి. ఆ సమయమున అది శ్రీ కైలాస మానస సరోవరముల కుశల సందేశములను తీసికొని మరలుచున్నవి. మనము మన బాల్యము నుండి వీటిని చూచితిమి మరియు బాల్యమందలి తరంగిత స్వరములతో ఆనందముతో వాటికి స్వాగతము కూడా యిచ్చియుంటిమి. కైలాస మానస స్మృతిని మనకై సస్యశ్యామలముగా నుంచుచున్న వ్యోమ మందలి ఆ యాత్రీకుల ఉపకారమును మన్నించవలెను. ఇదే విధమగు కృతజ్ఞత ప్రస్తుత యాత్రా గ్రంధరచయిత యెడల మన మనస్సులో వచ్చుచున్నది. ప్రాచీన గ్రంధముల ప్రకారము యాత్రలు రెండు విధములుగనున్నవి. ఒకటి శుక మార్గము. రెండవది పిపీలికా మార్గము. శుకాదులగు పక్షులు ఒక స్థానము నుండి మరియొక స్థానమునకు ఎగిరి వెళ్ళును. కాని అవి తమ వెనుక ఏ పదచిహ్నములను వదలియుంచవు. కాని చీమ ఒక్కొక్క కాలు ఎత్తుచు శ్రమపూర్వకమగు మార్గమును పూర్తి చేయును. దాని యొక్క పూర్తి కాలిబాట స్పష్టముగా మనకు కనబడును. ఈ విధముగానే అనేక మంది భారతీయులు ప్రతి సంవత్సరము హిమాలయములందలి దుర్గమ మార్గములను దాటి కైలాస మానస సరోవరముల దర్శనమునకు వెళ్ళుచున్నారు. కానీ శ్రీ స్వామి ప్రణవానంద యొక్క కైలాస దర్శనము ఒక స్తుత్య సంఘటన. వారు తమ కైలాస యాత్రను పిపీలికా గతిని మనముందు స్పష్టముగా, మూర్తివంతముగా చేయుటకు సుందరమైన స్తుత్యమైన ప్రయత్నము గావించిరి. కైలాస మానస సరోవర దర్శనముచే వారికెట్టి స్పూర్తి లభించినదో, వారి మనస్సుకు, నేత్రములకెట్టి స్వర్గీయ సుఖము లభించినదో అందులో దానిని వారందరకు పంచియిచ్చిరి. వారు తాము పొందిన ప్రసాదమును పంచి యిచ్చుటకు తమతో కలియమని ఉత్సాహముతో ప్రేరేపించిరి. శ్రీ కైలాస యాత్రపై ఇంత పూర్ణప్రశస్త పథప్రదర్శక గ్రంధము ఏ భాషలోను ఇంతవరకు లిఖింపబడియుండలేదు. పుస్తకమందలి మూడవ, నాల్గవ.................© 2017,www.logili.com All Rights Reserved.