భారతదేశ చరిత అధ్యయనం
చరిత్రను అధ్యయనం చేయడం వల్ల ఆయా కాలాల్లోని, ప్రాంతాలలోని ప్రజల గతాన్ని తెలుసుకోడానికి మనకు వీలు కలుగుతుంది. నిఘంటువును చూస్తే
'చరిత్ర' 'జరిగిపోయిన సంఘటనల వివరణ' అనే సాధారణ అర్ధం కనిపిస్తుంది. జీవనం, ఉత్పత్తి విధానాల ప్రాతిపదిక మీద సాధారణంగా చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలుగా విభజించడం జరిగింది. మన పూర్వికుల జీవన విధానం గురించి తెలుసుకోడానికి చరిత్ర మనకు వీలు కల్పిస్తుంది. మన పూర్వికులు, కొన్ని వేల సంవత్సరాలుగా భారత గడ్డమీద నివసిస్తూవచ్చారు. ప్రస్తుతం నివసిస్తున్నారు కూడా. అందువల్ల చరిత్ర అంటే, భూత, వర్తమాన కాలాల్లోని స్త్రీపురుషుల కథే. అయితే చరిత్ర అనేది తేదీల, సంఘటనల సంకలనం కాదు. ఇది కేవలం రాజుల పాలనలు, యుద్ధాలు, రాజ్యాల ఉత్థాన పతనాలు మాత్రమే కాదు. మైదాన ప్రాంతాల్లోని ప్రజలతోపాటు లేదా పర్వత ప్రాంతాల్లోని ప్రజల జీవన రీతులను కూడా చరిత్ర వెల్లడిస్తుంది. మానవులు ఎలా జీవించారో, అడవులను ఎలా నరికారో. చిన్న చిన్న నివాస ప్రాంతాలనెలా ఏర్పాటు చేసుకున్నారో, వివిధ రకాల ధాన్యాలనెలా పండించారో, బట్టలెలా తయారు చేశారో, ఇనుము, రాగి లోహాలతో పాటు ఇతర లోహాలకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానమెలా సొంతం చేసుకున్నారో, చివరగా, పట్టణాలు, నగరాలు, రాజ్యాలెలా స్థాపించారో చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ పరిణామాలన్నిటితో పాటు చదవడం, రాయడం, లెక్కించడం అనే సామర్థ్యాలు ఎలా రూపొందాయో చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా, వివిధ రకాల మత భావనలు, విశ్వాసాలు ఎలా రూపుదిద్దుకున్నాయో కూడా చరిత్రవల్ల వ్యక్తమవుతుంది. సామాజిక నిర్మాణం, ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థలోని కార్యకలాపాల మీద ఆధారపడింది. ప్రాచీన కాలంలో ప్రాగార్యులు, హింద్వార్యులు, గ్రీకులు, సిథియన్లు, హూణులు, టర్కులు మొదలయిన వారు మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాల నుంచి వలసలు వచ్చారు. ఈ వలసలవల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సంకీర్ణ స్వభావం గల సంస్కృతి విలసిల్లింది. ఈ సంకీర్ణతే చరిత్రను ఆకర్షణీయం చేసింది. సంస్కృతినీ దాని బాహుళ్య స్వభావాన్నీ అవగాహన చేసుకొనే విషయంలో ఇదే మనకు తోడ్పడుతుంది.................
భారతదేశ చరిత అధ్యయనం చరిత్రను అధ్యయనం చేయడం వల్ల ఆయా కాలాల్లోని, ప్రాంతాలలోని ప్రజల గతాన్ని తెలుసుకోడానికి మనకు వీలు కలుగుతుంది. నిఘంటువును చూస్తే 'చరిత్ర' 'జరిగిపోయిన సంఘటనల వివరణ' అనే సాధారణ అర్ధం కనిపిస్తుంది. జీవనం, ఉత్పత్తి విధానాల ప్రాతిపదిక మీద సాధారణంగా చరిత్రను ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలుగా విభజించడం జరిగింది. మన పూర్వికుల జీవన విధానం గురించి తెలుసుకోడానికి చరిత్ర మనకు వీలు కల్పిస్తుంది. మన పూర్వికులు, కొన్ని వేల సంవత్సరాలుగా భారత గడ్డమీద నివసిస్తూవచ్చారు. ప్రస్తుతం నివసిస్తున్నారు కూడా. అందువల్ల చరిత్ర అంటే, భూత, వర్తమాన కాలాల్లోని స్త్రీపురుషుల కథే. అయితే చరిత్ర అనేది తేదీల, సంఘటనల సంకలనం కాదు. ఇది కేవలం రాజుల పాలనలు, యుద్ధాలు, రాజ్యాల ఉత్థాన పతనాలు మాత్రమే కాదు. మైదాన ప్రాంతాల్లోని ప్రజలతోపాటు లేదా పర్వత ప్రాంతాల్లోని ప్రజల జీవన రీతులను కూడా చరిత్ర వెల్లడిస్తుంది. మానవులు ఎలా జీవించారో, అడవులను ఎలా నరికారో. చిన్న చిన్న నివాస ప్రాంతాలనెలా ఏర్పాటు చేసుకున్నారో, వివిధ రకాల ధాన్యాలనెలా పండించారో, బట్టలెలా తయారు చేశారో, ఇనుము, రాగి లోహాలతో పాటు ఇతర లోహాలకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానమెలా సొంతం చేసుకున్నారో, చివరగా, పట్టణాలు, నగరాలు, రాజ్యాలెలా స్థాపించారో చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఈ పరిణామాలన్నిటితో పాటు చదవడం, రాయడం, లెక్కించడం అనే సామర్థ్యాలు ఎలా రూపొందాయో చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా, వివిధ రకాల మత భావనలు, విశ్వాసాలు ఎలా రూపుదిద్దుకున్నాయో కూడా చరిత్రవల్ల వ్యక్తమవుతుంది. సామాజిక నిర్మాణం, ప్రధానంగా ఆర్ధిక వ్యవస్థలోని కార్యకలాపాల మీద ఆధారపడింది. ప్రాచీన కాలంలో ప్రాగార్యులు, హింద్వార్యులు, గ్రీకులు, సిథియన్లు, హూణులు, టర్కులు మొదలయిన వారు మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాల నుంచి వలసలు వచ్చారు. ఈ వలసలవల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సంకీర్ణ స్వభావం గల సంస్కృతి విలసిల్లింది. ఈ సంకీర్ణతే చరిత్రను ఆకర్షణీయం చేసింది. సంస్కృతినీ దాని బాహుళ్య స్వభావాన్నీ అవగాహన చేసుకొనే విషయంలో ఇదే మనకు తోడ్పడుతుంది.................© 2017,www.logili.com All Rights Reserved.