అనువాదకుని ప్రస్తావన
ఇండియా సామాజిక వాస్తవికతను అధ్యయనం చేయాలనుకునేవారెవరికైనా ఈ దేశ పాదార్థిక సామాజిక సంబంధాలను అధ్యారోపితం చేసిన అస్తిత్వ సంబంధాల రూపంలోని కుల వ్యవస్థ చలన నియమాలను అర్థం చేసుకోకతప్పదు. ఉత్పత్తి సంబంధాలు (ఆస్తి+శ్రమ+పంపిణీ సంబంధాలు), ప్రాథమిక స్త్రీ-పురుష సంబంధాలు, భాషా సంబంధాలు తదితర పాదార్థిక సంబంధాలకు అనుమేయం/ అనుమితి/ఆకళింపుగా విశ్వాసాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల సమ్మిళిత రూపంలో ఏర్పడిన కుల సంబంధాల వ్యవస్థ చారిత్రక పరిణామ సూత్రాలను పరిశీలించాలంటే అందుకు మూలమైన హిందూ మత వ్యవస్థను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. దాని పరిపూర్తి కోసం ఏ వృత్తినైనా ఎంచుకునే స్వేచ్చ గల విస్తృత వర్ణ సంబంధాల నుంచి వృత్తి పారంపర్యత కొనసాగే కుల వ్యవస్థకు జరిగిన చారిత్రక పరిణామక్రమాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. కుల సంబంధాలను అంశీభూతాలుగా చేసుకొని హిందూ మత వ్యవస్థ ఏర్పడినందున డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్కర్ హిందూ మతం గురించి, దానికి తగిన ఆధ్యాత్మికతా ప్రత్యామ్నాయం గురించి తీవ్రంగా అధ్యయనం చేసారు. మతాన్ని దైవికమైనదిగా కాక ఒకానొక నిర్దిష్ట సామాజిక దృక్పథం పునాదిగా సాగే జీవన విధానంగా ఆయన పరిగణించి, వివిధ మతాలను అధ్యయనం చేసి, చివరికి పలు సవరణలు ప్రాతిపదికగా బౌద్ధమతాన్ని ఆమోదించారు. ఆ క్రమంలో బౌద్ధాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఆయన 1. బుద్ధుడు, ఆయన ధర్మం'; 2. బుద్ధుడు, కారల్ మార్క్స్: 3. ప్రాచీన ఇండియాలో విప్లవం - ప్రతి విప్లవం' అనే మూడు గ్రంథాలను రాసేందుకు సంకల్పించాడు 'బుద్ధుడు, ఆయన ధర్మం' అనే పుస్తకాన్ని అంబేడ్కర్ మరణానంతరం ప్రచురించినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే ఆ గ్రంథం సిద్ధమైంది. మిగిలిన రెండు.................
అనువాదకుని ప్రస్తావన ఇండియా సామాజిక వాస్తవికతను అధ్యయనం చేయాలనుకునేవారెవరికైనా ఈ దేశ పాదార్థిక సామాజిక సంబంధాలను అధ్యారోపితం చేసిన అస్తిత్వ సంబంధాల రూపంలోని కుల వ్యవస్థ చలన నియమాలను అర్థం చేసుకోకతప్పదు. ఉత్పత్తి సంబంధాలు (ఆస్తి+శ్రమ+పంపిణీ సంబంధాలు), ప్రాథమిక స్త్రీ-పురుష సంబంధాలు, భాషా సంబంధాలు తదితర పాదార్థిక సంబంధాలకు అనుమేయం/ అనుమితి/ఆకళింపుగా విశ్వాసాలు, కట్టుబాట్లు, సంప్రదాయాల సమ్మిళిత రూపంలో ఏర్పడిన కుల సంబంధాల వ్యవస్థ చారిత్రక పరిణామ సూత్రాలను పరిశీలించాలంటే అందుకు మూలమైన హిందూ మత వ్యవస్థను అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. దాని పరిపూర్తి కోసం ఏ వృత్తినైనా ఎంచుకునే స్వేచ్చ గల విస్తృత వర్ణ సంబంధాల నుంచి వృత్తి పారంపర్యత కొనసాగే కుల వ్యవస్థకు జరిగిన చారిత్రక పరిణామక్రమాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. కుల సంబంధాలను అంశీభూతాలుగా చేసుకొని హిందూ మత వ్యవస్థ ఏర్పడినందున డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్కర్ హిందూ మతం గురించి, దానికి తగిన ఆధ్యాత్మికతా ప్రత్యామ్నాయం గురించి తీవ్రంగా అధ్యయనం చేసారు. మతాన్ని దైవికమైనదిగా కాక ఒకానొక నిర్దిష్ట సామాజిక దృక్పథం పునాదిగా సాగే జీవన విధానంగా ఆయన పరిగణించి, వివిధ మతాలను అధ్యయనం చేసి, చివరికి పలు సవరణలు ప్రాతిపదికగా బౌద్ధమతాన్ని ఆమోదించారు. ఆ క్రమంలో బౌద్ధాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా ఆయన 1. బుద్ధుడు, ఆయన ధర్మం'; 2. బుద్ధుడు, కారల్ మార్క్స్: 3. ప్రాచీన ఇండియాలో విప్లవం - ప్రతి విప్లవం' అనే మూడు గ్రంథాలను రాసేందుకు సంకల్పించాడు 'బుద్ధుడు, ఆయన ధర్మం' అనే పుస్తకాన్ని అంబేడ్కర్ మరణానంతరం ప్రచురించినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోనే ఆ గ్రంథం సిద్ధమైంది. మిగిలిన రెండు.................© 2017,www.logili.com All Rights Reserved.