ప్రతిఘాతుక ప్రతివిప్లవం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం' (ప్రా.వి.ప్ర.) అనే గ్రంథాన్ని పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాలుగా విభజించి ప్రచురించే వరుస క్రమంలో ఈ పుస్తకం మూడవది. ప్రా. వి. ప్ర. గ్రంథంలోని 8-13 అధ్యాయలను కలిపి మూడవ భాగంగా రూపొందించాము. ప్రాచీన ఇండియాలో బౌద్ధం అవతరణను విప్లవంగాను, బౌద్ధం పతనంతో ఆనాటి సమాజంలో తిరిగి ప్రబలమైన బ్రాహ్మణిజాన్ని ప్రతివిప్లవంగాను డాక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. బ్రాహ్మణీయం విజయం సాధించిన తర్వాత, అది సామాజిక రంగాలన్నిటిలోను సంఘటితమైన (గడ్డకట్టిన క్రమాన్ని ఈ అధ్యాయాల్లో వివరించేందుకు డాక్టర్ అంబేడ్కర్ నోట్స్ తయారుచేసుకున్నారు. వివిధ కొటేషన్లతో పాటు, వాటిపై తన అభిప్రాయాలను సైతం రేఖామాత్రంగా పొందుపరిచారు. ఇండియా సమాజంలో బౌద్ధీయం ప్రబల భావజాలంగా/భావజాల సంబంధాల రూపంలో అవతరించిన విప్లవ చారిత్రక సందర్భాన్ని మొదటి భాగంగాను; బౌద్ధీయం పతనానంతరం బ్రాహ్మణీయం పునర్జీవితం కావడం రెండవ భాగంగాను; ఆ తర్వాత బ్రాహ్మణీయం సంఘటితమై ఇండియా సమాజాన్ని పట్టిపీడించడాన్ని మూడవ భాగంగాను రూపొందించడం జరిగింది. అయితే ప్రా.వి.ప్ర. గ్రంథం మొత్తానికి, అందులోని 7వ అధ్యాయం మాత్రమే (బ్రాహ్మణీయ విజయం) ఉన్న పుస్తకానికి సురేంద్ర అజ్ఞాత్ విడి విడిగా ముందు మాటలు రాసారు. అయితే ప్రొ.వి.ప్ర. గ్రంథంలోని చివరి ఆరు అధ్యాయాలు విడిగా అజ్ఞాత్ సంపాదకత్వంలో పుస్తకంగా రాలేదు. వాటన్నిటినీ కలిపి 'ప్రతి విప్లవం: వర్ణవైరుధ్యాలు, శూద్రులు, స్త్రీలు' అనే పేరుతో మూడవ భాగంగా తీసుకొస్తున్నాము.
ఈ పుస్తకంలో (మూడవ భాగం) ప్రతివిప్లవాన్ని ముందుకుతెచ్చిన బ్రాహ్మణీయ శక్తుల ప్రతిఘాతుక స్వభావాన్ని గురించి అంబేడ్కర్ వివరించారు. ముఖ్యంగా........................
ప్రతిఘాతుక ప్రతివిప్లవం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం' (ప్రా.వి.ప్ర.) అనే గ్రంథాన్ని పాఠకుల సౌకర్యార్థం మూడు భాగాలుగా విభజించి ప్రచురించే వరుస క్రమంలో ఈ పుస్తకం మూడవది. ప్రా. వి. ప్ర. గ్రంథంలోని 8-13 అధ్యాయలను కలిపి మూడవ భాగంగా రూపొందించాము. ప్రాచీన ఇండియాలో బౌద్ధం అవతరణను విప్లవంగాను, బౌద్ధం పతనంతో ఆనాటి సమాజంలో తిరిగి ప్రబలమైన బ్రాహ్మణిజాన్ని ప్రతివిప్లవంగాను డాక్టర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. బ్రాహ్మణీయం విజయం సాధించిన తర్వాత, అది సామాజిక రంగాలన్నిటిలోను సంఘటితమైన (గడ్డకట్టిన క్రమాన్ని ఈ అధ్యాయాల్లో వివరించేందుకు డాక్టర్ అంబేడ్కర్ నోట్స్ తయారుచేసుకున్నారు. వివిధ కొటేషన్లతో పాటు, వాటిపై తన అభిప్రాయాలను సైతం రేఖామాత్రంగా పొందుపరిచారు. ఇండియా సమాజంలో బౌద్ధీయం ప్రబల భావజాలంగా/భావజాల సంబంధాల రూపంలో అవతరించిన విప్లవ చారిత్రక సందర్భాన్ని మొదటి భాగంగాను; బౌద్ధీయం పతనానంతరం బ్రాహ్మణీయం పునర్జీవితం కావడం రెండవ భాగంగాను; ఆ తర్వాత బ్రాహ్మణీయం సంఘటితమై ఇండియా సమాజాన్ని పట్టిపీడించడాన్ని మూడవ భాగంగాను రూపొందించడం జరిగింది. అయితే ప్రా.వి.ప్ర. గ్రంథం మొత్తానికి, అందులోని 7వ అధ్యాయం మాత్రమే (బ్రాహ్మణీయ విజయం) ఉన్న పుస్తకానికి సురేంద్ర అజ్ఞాత్ విడి విడిగా ముందు మాటలు రాసారు. అయితే ప్రొ.వి.ప్ర. గ్రంథంలోని చివరి ఆరు అధ్యాయాలు విడిగా అజ్ఞాత్ సంపాదకత్వంలో పుస్తకంగా రాలేదు. వాటన్నిటినీ కలిపి 'ప్రతి విప్లవం: వర్ణవైరుధ్యాలు, శూద్రులు, స్త్రీలు' అనే పేరుతో మూడవ భాగంగా తీసుకొస్తున్నాము. ఈ పుస్తకంలో (మూడవ భాగం) ప్రతివిప్లవాన్ని ముందుకుతెచ్చిన బ్రాహ్మణీయ శక్తుల ప్రతిఘాతుక స్వభావాన్ని గురించి అంబేడ్కర్ వివరించారు. ముఖ్యంగా........................© 2017,www.logili.com All Rights Reserved.