అనువాదకుని అవతారిక
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని తెలుగులోకి తాజాగా అనువదించి, ముద్రించే ప్రాజెక్టును చేపట్టామని, వాటిలో కొన్నిటిని మీరు అనువదించాలని 'సమాంతర పబ్లికేషన్స్' సంస్థవారు నన్ను కోరారు. డాక్టర్ అంబేద్కర్ రచనల్లో చరిత్ర, తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్ర విషయాలకు సంబంధించిన గ్రంథాలలో కొన్నిటినీ తెలుగులోకి అనువదించేందుకు నేను ఎంచుకున్నాను. ఆ క్రమంలో 'ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం' (ప్రా.వి.ప్ర.) అనే గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించి ముద్రించాలని అనుకున్నాం. డాక్టర్ సురేంద్ర అజ్ఞాత్ సంపాదకత్వంలో, ఆయన ముందుమాటతో ఇంగ్లీషు భాషలో ప్రచురితమైన ప్రా.వి.ప్ర. గ్రంథంలోని 1 నుంచి 5వ అధ్యాయాలను అనువదించి అదే శీర్షికతో మొదటి భాగంగా ప్రచురించడం జరిగింది. అయితే అజ్ఞాత్ సంపాదకత్వంలో ఆయన ముందుమాటతో ప్రా. వి. ప్ర. గ్రంథంలోని 7వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ విజయం'న్ని పాఠకుని సౌకర్యార్థం ఒక పుస్తకంగా వేసారు. అయితే ప్రా.వి.ప్ర. గ్రంథంలోని 6వ అధ్యాయం.. 'బ్రాహ్మణీయ సాహిత్యం' న్ని విడిచిపెట్టి, కేవలం 7వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ 'విజయం' ను మాత్రమే ప్రచురించడం వల్ల పాఠకునికి బౌద్ధం విధ్వంసమై, బ్రాహ్మణీయం విజేతగా నిలవడానికి గల కారణాలు సమగ్రంగా అర్థం కావడం సాధ్యం కాదని భావించాము. ఏదైనా యూరప్ లోని వచ్చిన పెట్టుబడిదారీ విప్లవానికి ముందుగా భావజాల రంగాల్లో ఉనికిలోకి వచ్చిన 'పునరుజ్జీవ విప్లవం' లాగా బ్రాహ్మణీయం ఇండియా సమాజంలో విజేతగా నిలిచేందుకు బ్రాహ్మణీయ సాహిత్యం ఎలా రూపొందిందో తెలుసుకోవడం అత్యవసరం. అందువల్ల సురేంద్ర అజ్ఞాత్ సంపాదకత్వంలోని 'బ్రాహ్మణీయ విజయం' గ్రంథానికి తోడు, పాఠకులను దృష్టిలో ఉంచుకొని 6వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ సాహిత్యం' అనే అధ్యాయాన్ని కూడా........
అనువాదకుని అవతారిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనల్ని తెలుగులోకి తాజాగా అనువదించి, ముద్రించే ప్రాజెక్టును చేపట్టామని, వాటిలో కొన్నిటిని మీరు అనువదించాలని 'సమాంతర పబ్లికేషన్స్' సంస్థవారు నన్ను కోరారు. డాక్టర్ అంబేద్కర్ రచనల్లో చరిత్ర, తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్ర విషయాలకు సంబంధించిన గ్రంథాలలో కొన్నిటినీ తెలుగులోకి అనువదించేందుకు నేను ఎంచుకున్నాను. ఆ క్రమంలో 'ప్రాచీన ఇండియాలో విప్లవం, ప్రతి విప్లవం' (ప్రా.వి.ప్ర.) అనే గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించి ముద్రించాలని అనుకున్నాం. డాక్టర్ సురేంద్ర అజ్ఞాత్ సంపాదకత్వంలో, ఆయన ముందుమాటతో ఇంగ్లీషు భాషలో ప్రచురితమైన ప్రా.వి.ప్ర. గ్రంథంలోని 1 నుంచి 5వ అధ్యాయాలను అనువదించి అదే శీర్షికతో మొదటి భాగంగా ప్రచురించడం జరిగింది. అయితే అజ్ఞాత్ సంపాదకత్వంలో ఆయన ముందుమాటతో ప్రా. వి. ప్ర. గ్రంథంలోని 7వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ విజయం'న్ని పాఠకుని సౌకర్యార్థం ఒక పుస్తకంగా వేసారు. అయితే ప్రా.వి.ప్ర. గ్రంథంలోని 6వ అధ్యాయం.. 'బ్రాహ్మణీయ సాహిత్యం' న్ని విడిచిపెట్టి, కేవలం 7వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ 'విజయం' ను మాత్రమే ప్రచురించడం వల్ల పాఠకునికి బౌద్ధం విధ్వంసమై, బ్రాహ్మణీయం విజేతగా నిలవడానికి గల కారణాలు సమగ్రంగా అర్థం కావడం సాధ్యం కాదని భావించాము. ఏదైనా యూరప్ లోని వచ్చిన పెట్టుబడిదారీ విప్లవానికి ముందుగా భావజాల రంగాల్లో ఉనికిలోకి వచ్చిన 'పునరుజ్జీవ విప్లవం' లాగా బ్రాహ్మణీయం ఇండియా సమాజంలో విజేతగా నిలిచేందుకు బ్రాహ్మణీయ సాహిత్యం ఎలా రూపొందిందో తెలుసుకోవడం అత్యవసరం. అందువల్ల సురేంద్ర అజ్ఞాత్ సంపాదకత్వంలోని 'బ్రాహ్మణీయ విజయం' గ్రంథానికి తోడు, పాఠకులను దృష్టిలో ఉంచుకొని 6వ అధ్యాయమైన 'బ్రాహ్మణీయ సాహిత్యం' అనే అధ్యాయాన్ని కూడా........© 2017,www.logili.com All Rights Reserved.