హంపీ నగరవీధులకు రెండు వైపులా పూలు పూసిన చెట్లకొమ్మలు గాలికి మనోహరంగా, వయ్యారంగా నాట్యం చేస్తున్నట్లు కదులుతున్నాయి. నగరంలో ఎటుచూసినా సౌధాలే. నగరంలో ప్రతి ఇంటిముందు పూలతోట, వెనుకవైపున ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రతి బజారుకూ మొదట, కడపట ఆకాశంలోకి దూసుకు పోయే గోపురాలున్నాయి. విజయనగర ప్రజలకు పూవులంటే మహాప్రాణం. యువతీ యువకులు తమ కొప్పుల్లో పరిమళాలు వెదజల్లే అనేకరకాల పూవులను అలంకరించుకొన్నారు. యువతులు అలంకరించుకొన్న ఆ పూల సువాసనలు యువకులను సంమ్మోహన పరుస్తున్నాయి.
అది దసరా ఉత్సవాల ప్రారంభవేడుక రోజు. హంపీ నగరమంతా కోలాహలంగా ఉంది. తుళ్ళిపడుతున్న యవ్వనం వీధుల్లో కుప్పబోసినట్లు నగరం మిడిసిమిడిసి పడుతోంది. సామంత రాజ్యాల రాచప్రముఖులు అప్పటికే నగరాన విడిది చేశారు. అళియ రామరాయలు తమ పాలెగాండ్రను, నాయక ప్రముఖులను నగరానికి పిలిపించారు. తమ ఆడంబరాన్నీ, శక్తి సామర్థ్యాలనూ, వైభవాన్ని ప్రదర్శించడానికి ఈ ఉత్సవాలు వేదికలౌతాయి.
ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి.........................
హంపీ నగరవీధులకు రెండు వైపులా పూలు పూసిన చెట్లకొమ్మలు గాలికి మనోహరంగా, వయ్యారంగా నాట్యం చేస్తున్నట్లు కదులుతున్నాయి. నగరంలో ఎటుచూసినా సౌధాలే. నగరంలో ప్రతి ఇంటిముందు పూలతోట, వెనుకవైపున ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రతి బజారుకూ మొదట, కడపట ఆకాశంలోకి దూసుకు పోయే గోపురాలున్నాయి. విజయనగర ప్రజలకు పూవులంటే మహాప్రాణం. యువతీ యువకులు తమ కొప్పుల్లో పరిమళాలు వెదజల్లే అనేకరకాల పూవులను అలంకరించుకొన్నారు. యువతులు అలంకరించుకొన్న ఆ పూల సువాసనలు యువకులను సంమ్మోహన పరుస్తున్నాయి. అది దసరా ఉత్సవాల ప్రారంభవేడుక రోజు. హంపీ నగరమంతా కోలాహలంగా ఉంది. తుళ్ళిపడుతున్న యవ్వనం వీధుల్లో కుప్పబోసినట్లు నగరం మిడిసిమిడిసి పడుతోంది. సామంత రాజ్యాల రాచప్రముఖులు అప్పటికే నగరాన విడిది చేశారు. అళియ రామరాయలు తమ పాలెగాండ్రను, నాయక ప్రముఖులను నగరానికి పిలిపించారు. తమ ఆడంబరాన్నీ, శక్తి సామర్థ్యాలనూ, వైభవాన్ని ప్రదర్శించడానికి ఈ ఉత్సవాలు వేదికలౌతాయి. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగుతాయి.........................© 2017,www.logili.com All Rights Reserved.