మా తాతగారైన కీ|| శే|| శ్రీ ముసునూరి వేంకట శాస్త్రి గారు (బ్రాహ్మణుల గోత్రములు శాఖలు పుస్తకమును రచించి 1973 సం||రంలో ప్రచురణ చేసినారు. వారి తదనంతరం మా నాన్నగారు కీ||శే|| శ్రీ ముసునూరి సుబ్బారావు గారు (సుశ్రీ) (ఎం.ఎస్. రాయ్ శాస్త్రి) ఈ పుస్తకమునందు కొన్ని మార్పులు చేసినారు. మా తాత గారి కాలము నుండి మా కుటుంబ సన్నిహితులైన శ్రీ పుట్రేవు సూర్య వేంకట్రావ్ గారు మా నాన్నగారికి సహాయాన్ని అందించినారు. మా పెదనాన్నగారైన కీ|| శే|| ముసునూరి నారాయణరావు గారి సతీమణి శ్రీమతి మాణిక్యాంబ గారు విలువైన ఈ పుస్తకములు అంతరించిపోకూడదని వీటిని పునఃముద్రణ చేయాలని అభిలషించి ప్రోత్సాహపరచినారు. సాంప్రదాయ ఆచారములందు ఆసక్తి గలవారి కోరిక మేరకు ఈ తరానికి ఉపయోగపడేలాగ చక్కని వివరణతో సంధ్యావందనము, గోత్రములు శాఖలు, ప్రవరలు గల ఈ పుస్తక ముద్రణ యందు నన్ను ప్రోత్సాహపరచినారు.