కేవలం ఒకే ఒక్క పిలుపు
ఆ ఉదయం ఠాకూర్ దర్శన్ సింహ్ ఇంట్లో హంగామాగా, హడావిడిగా ఉంది. దానికి కారణం ఆ రాత్రి చంద్రగ్రహణం. ఠాకూర్ తన వృద్ధ భార్యతో కలిసి గంగానది దగ్గరకు వెళ్లాలి. అందుకే వారి ప్రయాణపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కోడలు ఆయన చిరిగిన చొక్కా కుస్తోంది. రెండో కోడలు ఆయన తలపాగాని ఎలా మరమత్తు చేయాలా అని ఆలోచిస్తోంది. ఇద్దరు కూతుళ్ళు ఫలహారం తయారీలో ఉన్నారు. పిల్లలు మాత్రం అల్లరిచేస్తూ ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. ఇంటికి ఎవరన్నా వచ్చిపోతుంటే పిల్లలు రెచ్చిపోయి మారాం చేయటం సహజం. ఎవరైనా వెళ్లేప్పుడు 'మేమూ మీతో వస్తాం!' అని ఏడుస్తారు. ఎవరన్నా వస్తే వారు తెచ్చిన మిఠాయిలు, తినుబండారాలు తమకు సమంగా పంచాలని ఏడుస్తారు. అవ్వ పిల్లల్ని అందర్నీ సముదాయిస్తూ బుజ్జగిస్తూ మధ్య మధ్యలో తనకోడళ్ళను మందలిస్తుంది.
"జాగ్రత్తమ్మా పిల్లల్ని బాగా చూసుకోండి. బైటికి ఒంటరిగా పంపకండి. చేతిలో చాకు, పలుగు లాంటివి పట్టుకోకుండా, తీసుకోకుండా చూసుకోండి. మీకు నామాట నచ్చినా నచ్చకున్నా విని తీరాలి. వాకిలి ముందు ఎవరైనా సాధువు, బిచ్చగాడు వస్తే కసిరి కొట్టకండి.” కోడళ్లు వినీ విన్పించుకోనట్లున్నారు. ఎలాగోలా ఇక్కడ ఈవిడ బారినుండి తప్పించుకోవాలనే చూస్తున్నారు వారు. ఫాల్గుణ మాసం కావటంతో ఆటపాటల్తో గడపాలని అందరి ఉద్దేశం.
ఠాకూర్ వృద్ధుడైనా, మానసికంగా ఉల్లాసంగా ఉంటాడు. ఇంతవరకూ ఏ గ్రహణ గంగా స్నానాన్నీ చేయకుండా వదలలేదు. 'తప్పక వెళ్తుంటాను!' అని ఆయన గర్వపడ్తుంటాడు............................
కేవలం ఒకే ఒక్క పిలుపు ఆ ఉదయం ఠాకూర్ దర్శన్ సింహ్ ఇంట్లో హంగామాగా, హడావిడిగా ఉంది. దానికి కారణం ఆ రాత్రి చంద్రగ్రహణం. ఠాకూర్ తన వృద్ధ భార్యతో కలిసి గంగానది దగ్గరకు వెళ్లాలి. అందుకే వారి ప్రయాణపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కోడలు ఆయన చిరిగిన చొక్కా కుస్తోంది. రెండో కోడలు ఆయన తలపాగాని ఎలా మరమత్తు చేయాలా అని ఆలోచిస్తోంది. ఇద్దరు కూతుళ్ళు ఫలహారం తయారీలో ఉన్నారు. పిల్లలు మాత్రం అల్లరిచేస్తూ ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. ఇంటికి ఎవరన్నా వచ్చిపోతుంటే పిల్లలు రెచ్చిపోయి మారాం చేయటం సహజం. ఎవరైనా వెళ్లేప్పుడు 'మేమూ మీతో వస్తాం!' అని ఏడుస్తారు. ఎవరన్నా వస్తే వారు తెచ్చిన మిఠాయిలు, తినుబండారాలు తమకు సమంగా పంచాలని ఏడుస్తారు. అవ్వ పిల్లల్ని అందర్నీ సముదాయిస్తూ బుజ్జగిస్తూ మధ్య మధ్యలో తనకోడళ్ళను మందలిస్తుంది. "జాగ్రత్తమ్మా పిల్లల్ని బాగా చూసుకోండి. బైటికి ఒంటరిగా పంపకండి. చేతిలో చాకు, పలుగు లాంటివి పట్టుకోకుండా, తీసుకోకుండా చూసుకోండి. మీకు నామాట నచ్చినా నచ్చకున్నా విని తీరాలి. వాకిలి ముందు ఎవరైనా సాధువు, బిచ్చగాడు వస్తే కసిరి కొట్టకండి.” కోడళ్లు వినీ విన్పించుకోనట్లున్నారు. ఎలాగోలా ఇక్కడ ఈవిడ బారినుండి తప్పించుకోవాలనే చూస్తున్నారు వారు. ఫాల్గుణ మాసం కావటంతో ఆటపాటల్తో గడపాలని అందరి ఉద్దేశం. ఠాకూర్ వృద్ధుడైనా, మానసికంగా ఉల్లాసంగా ఉంటాడు. ఇంతవరకూ ఏ గ్రహణ గంగా స్నానాన్నీ చేయకుండా వదలలేదు. 'తప్పక వెళ్తుంటాను!' అని ఆయన గర్వపడ్తుంటాడు............................© 2017,www.logili.com All Rights Reserved.