పత్తి రైతుల విషాదం
నాసిరకం పత్తి విత్తనాల వల్ల రాష్ట్రంలో ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా వుంది. పంట పెట్టుబడిలో కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. నాసిరకం విత్తనాలను సరఫరా చేసిన కంపెనీల మీద చర్య తీసుకోవాలని, తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పత్తి రైతుల నష్టం మీద తగినంత శ్రద్ధ పెట్టడంలేదు. రైతులు ఆందోళన చేసిన చోట వ్యవసాయ శాఖ నిపుణుల ద్వారా పరిశీలన జరిపి నష్టానికి మూల కారణాలను గుర్తించడం లేదు. పత్తి పంట గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు ఏ మాత్రం సాగు కాని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గత రెండు సంవత్సరాల్లో భారీగా సాగు పెరిగింది. ఈ పెరుగుదలకు అనుగుణంగా విత్తనాలు, పురుగుమందులు, ప్రభుత్వ రుణ సహాయం, మార్కెటింగ్ సదుపాయం, వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకం లాంటి అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. దీనివల్ల విత్తన, పురుగు మందుల కంపెనీల ఊబిలో ఇరుక్కున్న రైతులు విలవిలలాడుతున్నారు.
పెరుగుతున్న పత్తి సాగు
ప్రస్తుతం దేశంలో పత్తి పంట సాగుపై 60 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా...వాణిజ్యం, ప్రాసెసింగ్ లాంటి పరోక్ష పద్ధతుల్లో మరో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఆధారపడి వున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. నీటి పారుదల అవకాశాలు వున్న ప్రాంతాల్లోనే కాక మెట్ట ప్రాంతాల్లో సైతం పత్తి సాగు పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో సాధారణ సాగు 15.37 లక్షల ఎకరాలు, 2021లో 1.82 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు కాగా, ఈ సంవత్సరం ఏకంగా 3.82 లక్షల ఎకరాల సాగు అదనంగా పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో సాగవుతుంది. ఈ సంవత్సరం సాగు పెరుగుదల రాయలసీమ జిల్లాలో...................
పత్తి రైతుల విషాదం నాసిరకం పత్తి విత్తనాల వల్ల రాష్ట్రంలో ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో ఈ నష్టం మరింత ఎక్కువగా వుంది. పంట పెట్టుబడిలో కోట్ల రూపాయలు నష్టపోయిన రైతులు రోడ్లు ఎక్కుతున్నారు. నాసిరకం విత్తనాలను సరఫరా చేసిన కంపెనీల మీద చర్య తీసుకోవాలని, తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పత్తి రైతుల నష్టం మీద తగినంత శ్రద్ధ పెట్టడంలేదు. రైతులు ఆందోళన చేసిన చోట వ్యవసాయ శాఖ నిపుణుల ద్వారా పరిశీలన జరిపి నష్టానికి మూల కారణాలను గుర్తించడం లేదు. పత్తి పంట గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు ఏ మాత్రం సాగు కాని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో గత రెండు సంవత్సరాల్లో భారీగా సాగు పెరిగింది. ఈ పెరుగుదలకు అనుగుణంగా విత్తనాలు, పురుగుమందులు, ప్రభుత్వ రుణ సహాయం, మార్కెటింగ్ సదుపాయం, వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకం లాంటి అవసరమైన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవడం లేదు. దీనివల్ల విత్తన, పురుగు మందుల కంపెనీల ఊబిలో ఇరుక్కున్న రైతులు విలవిలలాడుతున్నారు. పెరుగుతున్న పత్తి సాగు ప్రస్తుతం దేశంలో పత్తి పంట సాగుపై 60 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా...వాణిజ్యం, ప్రాసెసింగ్ లాంటి పరోక్ష పద్ధతుల్లో మరో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఆధారపడి వున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. నీటి పారుదల అవకాశాలు వున్న ప్రాంతాల్లోనే కాక మెట్ట ప్రాంతాల్లో సైతం పత్తి సాగు పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో సాధారణ సాగు 15.37 లక్షల ఎకరాలు, 2021లో 1.82 లక్షల ఎకరాల్లో అదనంగా సాగు కాగా, ఈ సంవత్సరం ఏకంగా 3.82 లక్షల ఎకరాల సాగు అదనంగా పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో సాగవుతుంది. ఈ సంవత్సరం సాగు పెరుగుదల రాయలసీమ జిల్లాలో...................© 2017,www.logili.com All Rights Reserved.