ప్రభుత్వాల విధానాలపై వాస్తవిక విశ్లేషణ
- వి. శ్రీనివాసరావు
వర్తమాన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలపై కా. రాంభూపాల్ ప్రజాశక్తి దిన పత్రికలో గత సంవత్సరన్నర కాలంగా రాస్తున్న వ్యాసాల పరంపరను మూడు భాగాలుగా చేసి వేరు వేరు సంపుటాలుగా ప్రచురించటం ముదావహం. వర్తమాన సమస్యలపై వారం వారం నిర్దిష్టంగా ఉండే సమస్యలను తీసుకొని లెక్కలతో సహా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో వివరించటం అభినందనీయమైన విషయం.
సాధారణంగా ఆర్థిక విషయాలు చాలా మందికి అర్ధం కావన్న భయం ఉంటుంది. కానీ ఈ వ్యాసాలు ఆ భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొని వాటికున్న మూలాలను ప్రభుత్వ విధానాలను వివరించి చైతన్యవంతం చేయటానికి ఈ వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. అభివృద్ధి పేరుతో పాలకులు ప్రజలను ముఖ్యంగా యువతరాన్ని నిరంతరం మభ్యపెడుతూ నెట్టుకొస్తున్నారు. ఒకవైపు సంక్షోభం కార్చిచ్చులా కబళిస్తున్నా మరోవైపు ఉషోదం అవబోతున్నది, మనం సూపర్ పవర్ అవుతున్నాం అని పగలే చుక్కల్ని చూపెట్టగలిగిన నైపుణ్యం పాలకవర్గాల ఆర్థిక మేధావులకు ఉంది. వాళ్ళ అసలు స్వరూపాన్ని ఎండగట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను ఈ వ్యాసాలు అంశాల వారీ చక్కగా వివరిస్తున్నాయి. ముఖ్యంగా అర్థశాస్త్రంలో విద్యార్థులుగా ఉండేవారు, ఇప్పుడిప్పుడే.................
ప్రభుత్వాల విధానాలపై వాస్తవిక విశ్లేషణ - వి. శ్రీనివాసరావు వర్తమాన ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలపై కా. రాంభూపాల్ ప్రజాశక్తి దిన పత్రికలో గత సంవత్సరన్నర కాలంగా రాస్తున్న వ్యాసాల పరంపరను మూడు భాగాలుగా చేసి వేరు వేరు సంపుటాలుగా ప్రచురించటం ముదావహం. వర్తమాన సమస్యలపై వారం వారం నిర్దిష్టంగా ఉండే సమస్యలను తీసుకొని లెక్కలతో సహా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో వివరించటం అభినందనీయమైన విషయం. సాధారణంగా ఆర్థిక విషయాలు చాలా మందికి అర్ధం కావన్న భయం ఉంటుంది. కానీ ఈ వ్యాసాలు ఆ భయాన్ని పోగొట్టి ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొని వాటికున్న మూలాలను ప్రభుత్వ విధానాలను వివరించి చైతన్యవంతం చేయటానికి ఈ వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. అభివృద్ధి పేరుతో పాలకులు ప్రజలను ముఖ్యంగా యువతరాన్ని నిరంతరం మభ్యపెడుతూ నెట్టుకొస్తున్నారు. ఒకవైపు సంక్షోభం కార్చిచ్చులా కబళిస్తున్నా మరోవైపు ఉషోదం అవబోతున్నది, మనం సూపర్ పవర్ అవుతున్నాం అని పగలే చుక్కల్ని చూపెట్టగలిగిన నైపుణ్యం పాలకవర్గాల ఆర్థిక మేధావులకు ఉంది. వాళ్ళ అసలు స్వరూపాన్ని ఎండగట్టి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను ఈ వ్యాసాలు అంశాల వారీ చక్కగా వివరిస్తున్నాయి. ముఖ్యంగా అర్థశాస్త్రంలో విద్యార్థులుగా ఉండేవారు, ఇప్పుడిప్పుడే.................© 2017,www.logili.com All Rights Reserved.