తల్లి గర్భంలోకి
నేనూ, చంద్ర, సుబ్రహ్మణ్యం గారు లోపలికి ప్రవేశించాం గుహలోకి.
సంధ్యా సమయం. లోపల వెలుతురు చాలా తక్కువ. తడుముకొంటూ నడుస్తున్నాం. యువ పూజారి హెచ్చరిస్తున్నాడు, వొకొక్కసారి బాగా వంగి నడవమని. లేకపోతే నెత్తి బొప్పి కడ్తుంది. మరోసారి యించుమించు చిన్నపిల్లల్లా పాకవలసి వచ్చింది.
తల్లి గర్భంలోకి ప్రవేశించినట్లుంది. కాలం తాలూకు మరో డైమన్షన్లోకి ప్రవేశించినట్లుంది. అదే సనాతనం. దానిపైన స్థల కాలాల పాదముద్రలు పడవు. అది అనంతం, దేశ కాల పరిమితులు లేనిది.
మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం.
మీయతే ఇతిమాయా. కొలవబడేదే మాయ. యీ ప్రపంచాన్ని మనం కొలతల్లో డైమన్షన్స్ లోంచి చూస్తాం. మనకి తెలుసున్నవి నాలుగే డైమన్షన్స్ - దృక్కోణాలు. గణితశాస్త్రం యింకా చాలా డైమన్షన్స్ని సైద్ధాంతికంగా సాధించింది. కాలాన్ని కూడా కొలవలేమని, అది నిరపేక్షమని అంటుంది వాక్యపదీయం. అది అనంతం. ఉషసూక్తంలో ఉషస్సుకి అనంతం అనే విశేషణాన్ని చేర్చింది రుగ్వేదం.
నేనూ, చంద్ర, సుబ్రహ్మణ్యం గారూ, పూజారీ అనంతంలోనే కదుల్తున్నట్లుంది. వొక మూసి వేయబడిన అంతర్ గుహ ద్వారం వద్ద ఆగాడు పూజారి. అదిగో కాశి అన్నాడు. సాక్షాత్తూ విశ్వేశ్వర నిలయం అన్నాడు.
ఎక్కడ అని నేను అడిగాను.
మూసివేసిన శిలని చూపించాడు. యీ గండశిలని తొలగిస్తే లోపలికి దారి యేర్పడ్తుంది. అక్కడి నుంచి జాగ్రత్తగా పయనిస్తే వారణాశికి భాగీరథీ తీరానికి దారితీస్తుంది అన్నాడు పూజారి.
యే గుహద్వారం యే క్షేత్ర స్థలానికి యే అద్భుత గమ్యానికి దారితీస్తుందో తెలుసుకోవడం అసాధ్యం అన్నాడు చంద్ర.........
తల్లి గర్భంలోకి నేనూ, చంద్ర, సుబ్రహ్మణ్యం గారు లోపలికి ప్రవేశించాం గుహలోకి. సంధ్యా సమయం. లోపల వెలుతురు చాలా తక్కువ. తడుముకొంటూ నడుస్తున్నాం. యువ పూజారి హెచ్చరిస్తున్నాడు, వొకొక్కసారి బాగా వంగి నడవమని. లేకపోతే నెత్తి బొప్పి కడ్తుంది. మరోసారి యించుమించు చిన్నపిల్లల్లా పాకవలసి వచ్చింది. తల్లి గర్భంలోకి ప్రవేశించినట్లుంది. కాలం తాలూకు మరో డైమన్షన్లోకి ప్రవేశించినట్లుంది. అదే సనాతనం. దానిపైన స్థల కాలాల పాదముద్రలు పడవు. అది అనంతం, దేశ కాల పరిమితులు లేనిది. మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. మీయతే ఇతిమాయా. కొలవబడేదే మాయ. యీ ప్రపంచాన్ని మనం కొలతల్లో డైమన్షన్స్ లోంచి చూస్తాం. మనకి తెలుసున్నవి నాలుగే డైమన్షన్స్ - దృక్కోణాలు. గణితశాస్త్రం యింకా చాలా డైమన్షన్స్ని సైద్ధాంతికంగా సాధించింది. కాలాన్ని కూడా కొలవలేమని, అది నిరపేక్షమని అంటుంది వాక్యపదీయం. అది అనంతం. ఉషసూక్తంలో ఉషస్సుకి అనంతం అనే విశేషణాన్ని చేర్చింది రుగ్వేదం. నేనూ, చంద్ర, సుబ్రహ్మణ్యం గారూ, పూజారీ అనంతంలోనే కదుల్తున్నట్లుంది. వొక మూసి వేయబడిన అంతర్ గుహ ద్వారం వద్ద ఆగాడు పూజారి. అదిగో కాశి అన్నాడు. సాక్షాత్తూ విశ్వేశ్వర నిలయం అన్నాడు. ఎక్కడ అని నేను అడిగాను. మూసివేసిన శిలని చూపించాడు. యీ గండశిలని తొలగిస్తే లోపలికి దారి యేర్పడ్తుంది. అక్కడి నుంచి జాగ్రత్తగా పయనిస్తే వారణాశికి భాగీరథీ తీరానికి దారితీస్తుంది అన్నాడు పూజారి. యే గుహద్వారం యే క్షేత్ర స్థలానికి యే అద్భుత గమ్యానికి దారితీస్తుందో తెలుసుకోవడం అసాధ్యం అన్నాడు చంద్ర.........© 2017,www.logili.com All Rights Reserved.