మేర్కొన్న మానవులు
కృష్ణాతీరాన ఉన్న ఆ పల్లెలో గ్రామదేవత ముత్యాలమ్మకు కొలువులుచేసే రోజు దగ్గిరపడుతోంది. కొలువులు ఐదురోజులు జరుగుతాయి. మొదటి మూడు రోజులు వూళ్ళో ఘటం తిరుగుతుంది. చాకలి పసుపు కుంకుమ పూసిన బాన తలమీద పెట్టుకొని వీధివీధికి వస్తున్నాడు. ఘటం రాగానే ఇంట్లో ఆడవాళ్ళు అన్నం, పెరుగూ ఆ బానలో వేస్తున్నారు.
ఊళ్ళో జాతరసందడి అప్పుడే కన్పిస్తోంది. ఇంటి గడపలకు పసుపురాసి బొట్లు పెట్టారు. ఒక్కొక్క వేపచెట్టు ఒక్కొక్క గ్రామదేవతకు నిలయమని వారి నమ్మకం. ముత్యాలమ్మ గుళ్ళకి సున్నం కొట్టారు. తోరణాలుకట్టి అలంకారాలు చేశారు. గుళ్ళముందు పందిళ్ళు వేశారు. బొమ్మనిచేసి అమ్మవారిని నిలిపారు. అమ్మ వారికి కొత్తచీర కట్టారు. అమ్మవారి కుడిచేతిలో చిన్న కత్తి మెరుస్తోంది. ఆ కత్తికి నిమ్మకాయ గుచ్చారు. పంబలవాళ్ళు, కొమ్ములవాళ్ళు, బైనీడు వాళ్ళు అంతా తర్లివచ్చారు. ఏటవతలి మాతంగికి కబురుపెట్టి పిలిపించారు. మాతంగి జీవితాంతం కన్యగానే ఉండిపోతుంది. కొలువుల్లో మాతంగి లేకపోతే ఏ పనీ జరగదు. వీరంగం వాయిస్తుంటే పంబలవాడు శివమెక్కిస్తే మాతంగికి ఒళ్ళు పెరిగి చిందుతొక్కుతుంది. ఆ ఆట చూడ్డానికి జనం విరుచుకుపడ్తారు. క్రితం సంవత్సరం వచ్చిన మాతంగి ముసలిది. చనిపోయింది. ఈ మాతంగి మాంచి వయసులో ఉంది. గజ్జెలు ఘల్లుఘల్లు మనిపించుకుంటూ బజార్లో నడుస్తుంటే గుంపు వెంటబడుతోంది...................
మేర్కొన్న మానవులు కృష్ణాతీరాన ఉన్న ఆ పల్లెలో గ్రామదేవత ముత్యాలమ్మకు కొలువులుచేసే రోజు దగ్గిరపడుతోంది. కొలువులు ఐదురోజులు జరుగుతాయి. మొదటి మూడు రోజులు వూళ్ళో ఘటం తిరుగుతుంది. చాకలి పసుపు కుంకుమ పూసిన బాన తలమీద పెట్టుకొని వీధివీధికి వస్తున్నాడు. ఘటం రాగానే ఇంట్లో ఆడవాళ్ళు అన్నం, పెరుగూ ఆ బానలో వేస్తున్నారు. ఊళ్ళో జాతరసందడి అప్పుడే కన్పిస్తోంది. ఇంటి గడపలకు పసుపురాసి బొట్లు పెట్టారు. ఒక్కొక్క వేపచెట్టు ఒక్కొక్క గ్రామదేవతకు నిలయమని వారి నమ్మకం. ముత్యాలమ్మ గుళ్ళకి సున్నం కొట్టారు. తోరణాలుకట్టి అలంకారాలు చేశారు. గుళ్ళముందు పందిళ్ళు వేశారు. బొమ్మనిచేసి అమ్మవారిని నిలిపారు. అమ్మ వారికి కొత్తచీర కట్టారు. అమ్మవారి కుడిచేతిలో చిన్న కత్తి మెరుస్తోంది. ఆ కత్తికి నిమ్మకాయ గుచ్చారు. పంబలవాళ్ళు, కొమ్ములవాళ్ళు, బైనీడు వాళ్ళు అంతా తర్లివచ్చారు. ఏటవతలి మాతంగికి కబురుపెట్టి పిలిపించారు. మాతంగి జీవితాంతం కన్యగానే ఉండిపోతుంది. కొలువుల్లో మాతంగి లేకపోతే ఏ పనీ జరగదు. వీరంగం వాయిస్తుంటే పంబలవాడు శివమెక్కిస్తే మాతంగికి ఒళ్ళు పెరిగి చిందుతొక్కుతుంది. ఆ ఆట చూడ్డానికి జనం విరుచుకుపడ్తారు. క్రితం సంవత్సరం వచ్చిన మాతంగి ముసలిది. చనిపోయింది. ఈ మాతంగి మాంచి వయసులో ఉంది. గజ్జెలు ఘల్లుఘల్లు మనిపించుకుంటూ బజార్లో నడుస్తుంటే గుంపు వెంటబడుతోంది...................© 2017,www.logili.com All Rights Reserved.