బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ బ్రహ్మశ్రీ సుందర శివరావు శర్మ, సుశీలమ్మల పుత్రులు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యులు. వీరు భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరి కుమారుడు శ్రీ చాగంటి. షణ్ముఖ చరణ్శర్మ, కోడలు దివ్య సుమన, కుమార్తె నాగ శ్రీవల్లి, అల్లుడు. వంశీకృష్ణ శర్మ.
వీరి కుమారుడు మిత్రులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు స్పిరిచ్యువల్ వర్క్స్ ట్రస్ట్, శ్రీ గురువాణి సంస్థల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేస్తున్నారు.
మనకి ఈ కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని, సమర్ధతని దృష్టిలో పెట్టుకొని, వేదవ్యాస భగవానుడు ధర్మానికి ప్రధానమైన వేదాన్ని నాలుగుగా విభాగం చేసి, పరంపరాగతంగా అందరికీ అందడం కోసమని ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చారు. అప్పటినుంచి వేదం పరంపరాగతంగా అట్లా నేర్చుకోబడుతోంది. మనకి ధర్మానికి ప్రమాణం వేదం. అసలు ఎట్లా బ్రతకాలి, ఏ పని చేయాలి, ఏ పని చెయ్యకూడదు, చేయవలసిన పని ఎట్లా చేయాలి - ఈ విషయాలు తెలియాలంటే, వేదం చదువుకోవాలి. కలియుగంలో అందరూ వేదాన్ని చదువుకోలేరు, వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. అప్పుడు ధర్మానుష్ఠానం చేయడము అన్నది క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అందుకే వ్యాస భగవానుడు వేదాంతర్గతమైన ధర్మం అందరికీ తెలియడం కోసం మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు..................
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ బ్రహ్మశ్రీ సుందర శివరావు శర్మ, సుశీలమ్మల పుత్రులు, బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి శిష్యులు. వీరు భారత ఆహార సంస్థలో పనిచేస్తున్నారు. సమాజ హితం కోసం రామాయణ, భారత, భాగవతాది అనేక భారతీయ సంస్కృతీ సాహిత్య అంశాలపై జనరంజకంగా ప్రవచనాలు చేస్తున్నారు. లక్షలాదిమందిని సమ్మోహితులను చేస్తున్న వీరి ప్రసంగశైలి విశిష్టమైనది. వీరి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరి కుమారుడు శ్రీ చాగంటి. షణ్ముఖ చరణ్శర్మ, కోడలు దివ్య సుమన, కుమార్తె నాగ శ్రీవల్లి, అల్లుడు. వంశీకృష్ణ శర్మ. వీరి కుమారుడు మిత్రులతో కలిసి చాగంటి కోటేశ్వరరావు స్పిరిచ్యువల్ వర్క్స్ ట్రస్ట్, శ్రీ గురువాణి సంస్థల ద్వారా భారతీయ సంప్రదాయాలను ప్రచారం చేయడానికి విశేషమైన కృషిచేస్తున్నారు. మనకి ఈ కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని, సమర్ధతని దృష్టిలో పెట్టుకొని, వేదవ్యాస భగవానుడు ధర్మానికి ప్రధానమైన వేదాన్ని నాలుగుగా విభాగం చేసి, పరంపరాగతంగా అందరికీ అందడం కోసమని ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చారు. అప్పటినుంచి వేదం పరంపరాగతంగా అట్లా నేర్చుకోబడుతోంది. మనకి ధర్మానికి ప్రమాణం వేదం. అసలు ఎట్లా బ్రతకాలి, ఏ పని చేయాలి, ఏ పని చెయ్యకూడదు, చేయవలసిన పని ఎట్లా చేయాలి - ఈ విషయాలు తెలియాలంటే, వేదం చదువుకోవాలి. కలియుగంలో అందరూ వేదాన్ని చదువుకోలేరు, వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. అప్పుడు ధర్మానుష్ఠానం చేయడము అన్నది క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అందుకే వ్యాస భగవానుడు వేదాంతర్గతమైన ధర్మం అందరికీ తెలియడం కోసం మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు..................© 2017,www.logili.com All Rights Reserved.