అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. 2014 ఫిబ్రవరి 18-20 తారీకులలో అంతా ఖరారు బపోయింది. అవతలి పక్షం ఆశించినట్టు ఆఖరి ఓవర్లో ఏ సిక్సర్లూ పడలేదు. కలగన్నట్టు, ఏ చక్రమూ అడ్డుపడలేదు. ప్రతాపాలూ భీషణ ప్రతిజ్ఞలూ అన్నీ పెప్పర్ స్ప్రే గా ఆవిరయిపోయాయి. పోరాటమే గెలిచింది. వెనువెంటనే ఇక, అనంతర వాస్తవికత రంగప్రవేశం చేసింది. నూతన రాష్ట్రం తెలంగాణకు, అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఎవరి రాజకీయపటం వారికి, ఎవరి సామాజికార్థిక ప్రయాణం వారికి అవతరించింది.
తెలంగాణ ప్రజలకు అది ఒక విజయెత్సాహ, ఆనంద సందర్భం. చరిత్రలు సృష్టించడమే తప్ప, ఒక్క విజయాన్నీ అనుభవించని నేల తెలంగాణ, భారతదేశంలో భాగమైనప్పటి నుంచి, ప్రత్యేకమైన ఉనికి కోసం ఆరాటపడుతూ, వివక్ష, విస్మరణ, వలసీకరణ మధ్య, అణగారిపోతూ పోరాడుతూ వచ్చింది. మలి మహాదశ తెలంగాణ ఉద్యమం సుమారు రెండు దశాబ్దాలు సాగి, అనేక సాహసత్యాగాలతో, సృజనాత్మక కార్యాచరణలతో, సకలజనుల భాగస్వామ్యంతో, లక్ష్యాన్ని సాధించుకుంది. దీని అపురూపతల నుంచి ప్రత్యేకతలనుంచి ఇతర ఉద్యమాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది.
సాంస్కృతిక, సాహిత్య ఉద్యమకారులు సంస్థల దగ్గర నుంచి మొదలు పెట్టి, వివిధ ఉద్యమశ్రేణుల వేదిక రాజకీయ జెఎసి దాకా తెలంగాణ ఉద్యమకాలంలో వేలాది సమూహాలు రకరకాల పేర్లతో అవతరించి పనిచేశాయి. ప్రత్యేక రాష్ట్రం కోసమే. అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యమరాజకీయ నాయకత్వం చేపట్టడం సహజమే. ప్రధానస్రవంతి రాజకీయ రంగస్థలంలో అభిప్రాయ సమీకరణలో, ఎన్నికల పోరాటాల్లో ఆ పార్టీ, దాని నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న చొరవలు కీలకమయినవి. కానీ, ఎన్నికల రంగానికి వెలుపల పనిచేసిన అనేక శక్తులే తెలంగాణ ఉద్యమానికి విశ్వసనీయతను, ప్రజాభూమికను ఏర్పరచాయి. అనేక పార్టీలు,.....................
స్వప్నభంగం అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి. 2014 ఫిబ్రవరి 18-20 తారీకులలో అంతా ఖరారు బపోయింది. అవతలి పక్షం ఆశించినట్టు ఆఖరి ఓవర్లో ఏ సిక్సర్లూ పడలేదు. కలగన్నట్టు, ఏ చక్రమూ అడ్డుపడలేదు. ప్రతాపాలూ భీషణ ప్రతిజ్ఞలూ అన్నీ పెప్పర్ స్ప్రే గా ఆవిరయిపోయాయి. పోరాటమే గెలిచింది. వెనువెంటనే ఇక, అనంతర వాస్తవికత రంగప్రవేశం చేసింది. నూతన రాష్ట్రం తెలంగాణకు, అవశేష ఆంధ్రప్రదేశ్ కు ఎవరి రాజకీయపటం వారికి, ఎవరి సామాజికార్థిక ప్రయాణం వారికి అవతరించింది. తెలంగాణ ప్రజలకు అది ఒక విజయెత్సాహ, ఆనంద సందర్భం. చరిత్రలు సృష్టించడమే తప్ప, ఒక్క విజయాన్నీ అనుభవించని నేల తెలంగాణ, భారతదేశంలో భాగమైనప్పటి నుంచి, ప్రత్యేకమైన ఉనికి కోసం ఆరాటపడుతూ, వివక్ష, విస్మరణ, వలసీకరణ మధ్య, అణగారిపోతూ పోరాడుతూ వచ్చింది. మలి మహాదశ తెలంగాణ ఉద్యమం సుమారు రెండు దశాబ్దాలు సాగి, అనేక సాహసత్యాగాలతో, సృజనాత్మక కార్యాచరణలతో, సకలజనుల భాగస్వామ్యంతో, లక్ష్యాన్ని సాధించుకుంది. దీని అపురూపతల నుంచి ప్రత్యేకతలనుంచి ఇతర ఉద్యమాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమకారులు సంస్థల దగ్గర నుంచి మొదలు పెట్టి, వివిధ ఉద్యమశ్రేణుల వేదిక రాజకీయ జెఎసి దాకా తెలంగాణ ఉద్యమకాలంలో వేలాది సమూహాలు రకరకాల పేర్లతో అవతరించి పనిచేశాయి. ప్రత్యేక రాష్ట్రం కోసమే. అవతరించిన తెలంగాణ రాష్ట్రసమితి ఉద్యమరాజకీయ నాయకత్వం చేపట్టడం సహజమే. ప్రధానస్రవంతి రాజకీయ రంగస్థలంలో అభిప్రాయ సమీకరణలో, ఎన్నికల పోరాటాల్లో ఆ పార్టీ, దాని నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న చొరవలు కీలకమయినవి. కానీ, ఎన్నికల రంగానికి వెలుపల పనిచేసిన అనేక శక్తులే తెలంగాణ ఉద్యమానికి విశ్వసనీయతను, ప్రజాభూమికను ఏర్పరచాయి. అనేక పార్టీలు,.....................© 2017,www.logili.com All Rights Reserved.