తెలంగాణా ఉద్యమం కేవలం ఒక భౌగోళిక ప్రాంతీయ ఉద్యమం మాత్రమే కాదు, అదొక సంపూర్ణ సామాజిక అస్తిత్వ ఆకాంక్ష, విస్తృత చరిత్ర, విలక్షణ సంస్కృతీ, వీరోచిత వారసత్వం ఈ అస్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న అంశాలు. వీటిని జ్ఞాపకాల దొంతరల్లోంచి వెతికి తెచ్చింది. తెలంగాణా మేధావి వర్గం. నిజానికి ఈ వర్గమే తెలంగాణా భావ వ్యాప్తిని ఒక బాధ్యతగా స్వీకరించింది. ఉద్యమానికి ఊపిరిపోసి నిలబెట్టింది. తెలంగాణా అనే ఒక మహా స్వప్నాన్ని సాకారం చేసింది. అందులో పరిశోధకులున్నారు, పాత్రికేయులు, రచయితలున్నారు. కవి, గాయకులూ ఎందరో ఉన్నారు. అందులో ముందు వరుసలో కె.శ్రీనివాస్ ఉంటారు. ఒక పరిశోధకుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, కాలమిస్టుగా, సంపాదకుడిగా, అనేక సందర్భాల్లో వక్తగా శ్రీనివాస్ తెలంగాణా ఉద్యమానికి లోతైన అవగాహనా అందించారు.
తెలంగాణా వైతాళికుల సారస్వత పరిషత్తులో సాహిత్య పాఠాలు నేర్చుకున్న శ్రీనివాస్ కేవలం సాహిత్యకారుడిగానే మిగిలిపోలేదు. మరుగున పడిపోయిన తెలంగాణా చరిత్రను వెలికితీసే ప్రయత్నం చేశారు. తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనం ఫై ప్రామాణికమైన పరిశోధన చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా అంతకుమించి ప్రజాస్వామ్యవాదిగా పీడితుల పక్షాన నిలబడ్డారు. వ్యక్తిత్వంగా అలవరచుకున్న విశాల సామాజిక దృక్పథం, జీవిత ఆదరణగా పాటించిన నిజాయితీ ఆయన రచనల్లో కూడా కనిపిస్తాయి. తెలంగాణా అనే ఒక అమూర్త భావనకున్న సాంస్కృతిక భావాలు వెతికి తీసి , తాత్విక భూమికను విస్తరించడంలో, తెలంగాణా వాదానికి ఒక సిద్ధాంత ప్రతిపత్తిని తీసుకురావడంలో, తెలంగాణా నినాదాన్ని ఒక భావజాలంగా మలచడంలో, అలాగే తెలంగాణా ఉద్యమానికి ఉన్న ప్రాజాస్వామిక పునాదిని మరింత బలోపేతం చేయడంలో తన వ్యాసాలు, సంపాదకీయ రచనల ద్వారా కె.శ్రీనివాస్ చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. అంతేకాదు ఆయన మా లాంటి అనేక మందికి పత్రికా రచనలో అనుసరణీయుడిగా, అగ్రజుడుగా, ఆదర్శప్రాయుడుగా నిలబడ్డారు.
- ఘంటా చక్రపాణి
తెలంగాణా ఉద్యమం కేవలం ఒక భౌగోళిక ప్రాంతీయ ఉద్యమం మాత్రమే కాదు, అదొక సంపూర్ణ సామాజిక అస్తిత్వ ఆకాంక్ష, విస్తృత చరిత్ర, విలక్షణ సంస్కృతీ, వీరోచిత వారసత్వం ఈ అస్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న అంశాలు. వీటిని జ్ఞాపకాల దొంతరల్లోంచి వెతికి తెచ్చింది. తెలంగాణా మేధావి వర్గం. నిజానికి ఈ వర్గమే తెలంగాణా భావ వ్యాప్తిని ఒక బాధ్యతగా స్వీకరించింది. ఉద్యమానికి ఊపిరిపోసి నిలబెట్టింది. తెలంగాణా అనే ఒక మహా స్వప్నాన్ని సాకారం చేసింది. అందులో పరిశోధకులున్నారు, పాత్రికేయులు, రచయితలున్నారు. కవి, గాయకులూ ఎందరో ఉన్నారు. అందులో ముందు వరుసలో కె.శ్రీనివాస్ ఉంటారు. ఒక పరిశోధకుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, కాలమిస్టుగా, సంపాదకుడిగా, అనేక సందర్భాల్లో వక్తగా శ్రీనివాస్ తెలంగాణా ఉద్యమానికి లోతైన అవగాహనా అందించారు. తెలంగాణా వైతాళికుల సారస్వత పరిషత్తులో సాహిత్య పాఠాలు నేర్చుకున్న శ్రీనివాస్ కేవలం సాహిత్యకారుడిగానే మిగిలిపోలేదు. మరుగున పడిపోయిన తెలంగాణా చరిత్రను వెలికితీసే ప్రయత్నం చేశారు. తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనం ఫై ప్రామాణికమైన పరిశోధన చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా అంతకుమించి ప్రజాస్వామ్యవాదిగా పీడితుల పక్షాన నిలబడ్డారు. వ్యక్తిత్వంగా అలవరచుకున్న విశాల సామాజిక దృక్పథం, జీవిత ఆదరణగా పాటించిన నిజాయితీ ఆయన రచనల్లో కూడా కనిపిస్తాయి. తెలంగాణా అనే ఒక అమూర్త భావనకున్న సాంస్కృతిక భావాలు వెతికి తీసి , తాత్విక భూమికను విస్తరించడంలో, తెలంగాణా వాదానికి ఒక సిద్ధాంత ప్రతిపత్తిని తీసుకురావడంలో, తెలంగాణా నినాదాన్ని ఒక భావజాలంగా మలచడంలో, అలాగే తెలంగాణా ఉద్యమానికి ఉన్న ప్రాజాస్వామిక పునాదిని మరింత బలోపేతం చేయడంలో తన వ్యాసాలు, సంపాదకీయ రచనల ద్వారా కె.శ్రీనివాస్ చారిత్రాత్మకమైన పాత్రను పోషించారు. అంతేకాదు ఆయన మా లాంటి అనేక మందికి పత్రికా రచనలో అనుసరణీయుడిగా, అగ్రజుడుగా, ఆదర్శప్రాయుడుగా నిలబడ్డారు. - ఘంటా చక్రపాణి© 2017,www.logili.com All Rights Reserved.