రాజకీయం
'కొత్త దేవుడండీ కొంగొత్త దేవుడండీ/ ఇతడే దిక్కని మొక్కని వాడికి/ దిక్కు మొక్కు లేదంటండీ.... పాత దేవుడు పట్టిన తప్పులు / ఒప్పులకుప్పలు చేస్తాడండీ/ కొత్త దేవుని కొలిచిన వారికి/ కొక్కొక్కొ కొదవే లేదండీ' అంటూ... సినీకవి వేటూరి రాసిన ఓ పాటలోని ఈ వాక్యాలు మన కొత్తదేవుడికి సరిగ్గా సరిపోతాయి. నేలకు స్వర్గం దించానంటాడు... ఆ స్వర్గాన్ని ప్రజలందరికీ పంచానంటాడు. ఆ పైన నెత్తిన చేతులు పెడతాడు. స్వర్గమేదని ఎవరైనా అడిగితే... నువ్వు రాజకీయం చేస్తున్నావ్ అంటాడు. దేశం గురించి దేశభక్తి గురించి గొప్పగా చెబుతాడు. చివరకు 'కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు... ఇండియన్ బ్రీడ్ కుక్కపిల్లలనే పెంచుకోవాలి. వాటికి భారతీయ పేర్లు పెట్టాలి'... అని పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన 'మన్ కీ బాత్' లో మన కొత్తదేవుడు ప్రవచించారు. 'వేషమూ మార్చెను.. భాషనూ మార్చెను/ మోసము నేర్చెను.. తలలే మార్చెను..' అంటారు పింగళివారు. 130 కోట్ల మంది ప్రజలకు నిత్యావసరం అయిన ఆహార ధాన్యాలను మాత్రం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలట. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే... వాడికి దేశభక్తిలేదు, వాడు రాజకీయం చేస్తున్నాడు... అంటూ రా - అంటే రాక్షసంగా, జ - అంటే జనానికి, కీ - అంటే కీడుచేసే, యం - అంటే.. యంత్రాంగం' గా మార్చేశాడు.
దేశ రాజధానిలో... నడిరోడ్డుపైన 38 రోజులుగా రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తోంటే, బిజెపి మాత్రం దేశవ్యాప్తంగా 500 పైగా మీటింగులు పెట్టి, రైతు ఉద్యమంపై తన అక్కసునంతా వెళ్లగక్కుతూ, తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయిస్తూ... ఈ పోరాటం కేవలం మద్దతు ధర కోసమే అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వావలంబన భారత్, ఆత్మ నిర్భర్ భారత్ అంటూ హృదయంలేని ఆత్మనిర్భరం గురించి చిలకపలుకుల్లా వల్లెవేస్తున్నారు. ఈ దేశానికి హృదయం రైతులు. వారి హృదయస్పందన వినండీ... అంటే రాజకీయం అంటున్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అంటున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి పోరాటంలోకి దింపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మా ఉద్యమంలో రాజకీయ............................
రాజకీయం 'కొత్త దేవుడండీ కొంగొత్త దేవుడండీ/ ఇతడే దిక్కని మొక్కని వాడికి/ దిక్కు మొక్కు లేదంటండీ.... పాత దేవుడు పట్టిన తప్పులు / ఒప్పులకుప్పలు చేస్తాడండీ/ కొత్త దేవుని కొలిచిన వారికి/ కొక్కొక్కొ కొదవే లేదండీ' అంటూ... సినీకవి వేటూరి రాసిన ఓ పాటలోని ఈ వాక్యాలు మన కొత్తదేవుడికి సరిగ్గా సరిపోతాయి. నేలకు స్వర్గం దించానంటాడు... ఆ స్వర్గాన్ని ప్రజలందరికీ పంచానంటాడు. ఆ పైన నెత్తిన చేతులు పెడతాడు. స్వర్గమేదని ఎవరైనా అడిగితే... నువ్వు రాజకీయం చేస్తున్నావ్ అంటాడు. దేశం గురించి దేశభక్తి గురించి గొప్పగా చెబుతాడు. చివరకు 'కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు... ఇండియన్ బ్రీడ్ కుక్కపిల్లలనే పెంచుకోవాలి. వాటికి భారతీయ పేర్లు పెట్టాలి'... అని పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన 'మన్ కీ బాత్' లో మన కొత్తదేవుడు ప్రవచించారు. 'వేషమూ మార్చెను.. భాషనూ మార్చెను/ మోసము నేర్చెను.. తలలే మార్చెను..' అంటారు పింగళివారు. 130 కోట్ల మంది ప్రజలకు నిత్యావసరం అయిన ఆహార ధాన్యాలను మాత్రం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలట. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే... వాడికి దేశభక్తిలేదు, వాడు రాజకీయం చేస్తున్నాడు... అంటూ రా - అంటే రాక్షసంగా, జ - అంటే జనానికి, కీ - అంటే కీడుచేసే, యం - అంటే.. యంత్రాంగం' గా మార్చేశాడు. దేశ రాజధానిలో... నడిరోడ్డుపైన 38 రోజులుగా రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తోంటే, బిజెపి మాత్రం దేశవ్యాప్తంగా 500 పైగా మీటింగులు పెట్టి, రైతు ఉద్యమంపై తన అక్కసునంతా వెళ్లగక్కుతూ, తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు రాయిస్తూ... ఈ పోరాటం కేవలం మద్దతు ధర కోసమే అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వావలంబన భారత్, ఆత్మ నిర్భర్ భారత్ అంటూ హృదయంలేని ఆత్మనిర్భరం గురించి చిలకపలుకుల్లా వల్లెవేస్తున్నారు. ఈ దేశానికి హృదయం రైతులు. వారి హృదయస్పందన వినండీ... అంటే రాజకీయం అంటున్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అంటున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి పోరాటంలోకి దింపుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మా ఉద్యమంలో రాజకీయ............................© 2017,www.logili.com All Rights Reserved.