మనం మానవులం. సంఘజీవులం. పరస్పర ఆధారితులం. కలిసిమెలిసి, జీవిత లాలిత్యాలనీ, జీవన సౌరాభాలనీ ప్రోది చేసుకొంటున్న వాళ్ళం. అందాలను ఆనందాలను అందినంత మేరా అల్లుకుపోయే వాళ్ళం. ఆడవాళ్ళం, మగవాళ్ళం వేరు వేరు సుదూర గ్రహాల మీద జీవించడం లేదు. ఆ కన్ను నీరు కారిస్తే, ఈ కంట నీరు చిప్పిల్లుతుంది. ఆ గుండె బీటు వారితే, ఈ గుండె పగిలి బద్దలవుతుంది.
అయితే, అంత అపురూపమైన, అందమైన మానవసంబంధాలలో, ఇంత అంధకారం అలముకున్నదేమిటి? అడుగడుగునా ఆ అభిజాత్యాలేమిటి? అణిచివేతలేమిటి? కొరడా ఝుళింపులేమిటి? కర్కశ మృదంగ ధ్వనులేమిటి? ఒకరి ఊపిరిపై, ఉనికిపై ఊడలు దిగిన, ఆ అదుపులేమిటి? ఆజ్ఞలేమిటి? ఆంక్షలేమిటి? మనలోని మానవప్రకృతియైన ప్రేమను, ఆప్యాయతను, నమ్మకాన్ని మమకారాన్ని, అంత అలవోకగా ఏమార్చుతూ, మనం మానవులమన్న స్పృహ నుంచే మరుపున పడుతున్నామేం? అంతూదరి లేని ఇలాంటి ప్రశ్నలతో, గుండె చిక్కబట్టి నప్పుడు, గొంతు పెగలనప్పుడు, చిప్పిల్లిన కన్నీటిచుక్కలు ఈ పారిజాతాలు.
మనం మానవులం. సంఘజీవులం. పరస్పర ఆధారితులం. కలిసిమెలిసి, జీవిత లాలిత్యాలనీ, జీవన సౌరాభాలనీ ప్రోది చేసుకొంటున్న వాళ్ళం. అందాలను ఆనందాలను అందినంత మేరా అల్లుకుపోయే వాళ్ళం. ఆడవాళ్ళం, మగవాళ్ళం వేరు వేరు సుదూర గ్రహాల మీద జీవించడం లేదు. ఆ కన్ను నీరు కారిస్తే, ఈ కంట నీరు చిప్పిల్లుతుంది. ఆ గుండె బీటు వారితే, ఈ గుండె పగిలి బద్దలవుతుంది. అయితే, అంత అపురూపమైన, అందమైన మానవసంబంధాలలో, ఇంత అంధకారం అలముకున్నదేమిటి? అడుగడుగునా ఆ అభిజాత్యాలేమిటి? అణిచివేతలేమిటి? కొరడా ఝుళింపులేమిటి? కర్కశ మృదంగ ధ్వనులేమిటి? ఒకరి ఊపిరిపై, ఉనికిపై ఊడలు దిగిన, ఆ అదుపులేమిటి? ఆజ్ఞలేమిటి? ఆంక్షలేమిటి? మనలోని మానవప్రకృతియైన ప్రేమను, ఆప్యాయతను, నమ్మకాన్ని మమకారాన్ని, అంత అలవోకగా ఏమార్చుతూ, మనం మానవులమన్న స్పృహ నుంచే మరుపున పడుతున్నామేం? అంతూదరి లేని ఇలాంటి ప్రశ్నలతో, గుండె చిక్కబట్టి నప్పుడు, గొంతు పెగలనప్పుడు, చిప్పిల్లిన కన్నీటిచుక్కలు ఈ పారిజాతాలు.© 2017,www.logili.com All Rights Reserved.