జన్యుమార్పిడి పంటలు జీవసాంకేతిక శాస్త్ర చమత్కారం. అయితే, అనేక అభ్యంతరాల నడుమ, అవి నిలదీయబడ్డాయి. అధికారక అనుమతి పత్రం చేతబట్టుకొని, మన వాకిట్లో నిలబడి ఉన్నాయి. రమ్మనడానికి పొమ్మనడానికి నడుమ అనేక ప్రశ్నలు. వాటిలో కొన్నిటినైనా తెలుసుకునేందుకు చేసిన చిన్న ప్రయత్నమే, ఈ 'వచ్చే దారేది'.
మన ఆహారాన్ని మనం ఎంపిక చేసుకోవడంలో మనకు గల మౌలిక స్వేచ్చను ప్రకటిస్తూ - ఆ ఆహార పంటల జన్యువైవిధ్యాన్ని పదిలపరచవలసిన అవసరాన్ని వత్తి చెపుతూ - మీ అభిప్రాయాల కోసం ఈ పుస్తకం. మీ ఆలోచనలను ఏ కొంతైనా ఈ దిశగా కొనసాగించడానికి మాధ్యమం అవుతుందని ఆశిస్తున్నాను. మన వంకాయ జన్యుభద్రతను కాపాడడానికి, దేశవ్యాప్తంగా, ప్రపంచమంతటా - పలువురు చేస్తున్న నిబద్ద కృషి వినమ్రంగా సమర్పిస్తున్న ఈ పుస్తక ప్రయత్నం ఒక చిన్న నూలుపోగు మాత్రమే.
- చంద్రలత
జన్యుమార్పిడి పంటలు జీవసాంకేతిక శాస్త్ర చమత్కారం. అయితే, అనేక అభ్యంతరాల నడుమ, అవి నిలదీయబడ్డాయి. అధికారక అనుమతి పత్రం చేతబట్టుకొని, మన వాకిట్లో నిలబడి ఉన్నాయి. రమ్మనడానికి పొమ్మనడానికి నడుమ అనేక ప్రశ్నలు. వాటిలో కొన్నిటినైనా తెలుసుకునేందుకు చేసిన చిన్న ప్రయత్నమే, ఈ 'వచ్చే దారేది'. మన ఆహారాన్ని మనం ఎంపిక చేసుకోవడంలో మనకు గల మౌలిక స్వేచ్చను ప్రకటిస్తూ - ఆ ఆహార పంటల జన్యువైవిధ్యాన్ని పదిలపరచవలసిన అవసరాన్ని వత్తి చెపుతూ - మీ అభిప్రాయాల కోసం ఈ పుస్తకం. మీ ఆలోచనలను ఏ కొంతైనా ఈ దిశగా కొనసాగించడానికి మాధ్యమం అవుతుందని ఆశిస్తున్నాను. మన వంకాయ జన్యుభద్రతను కాపాడడానికి, దేశవ్యాప్తంగా, ప్రపంచమంతటా - పలువురు చేస్తున్న నిబద్ద కృషి వినమ్రంగా సమర్పిస్తున్న ఈ పుస్తక ప్రయత్నం ఒక చిన్న నూలుపోగు మాత్రమే. - చంద్రలత© 2017,www.logili.com All Rights Reserved.