అమృతము కద ప్రాకృతకావ్య! మట్టిదాని
నెవరు చదువుట, వినుటయు నెరుగలేదొ
వారు పనిగొని కామతత్త్వంబు గూర్చి
చర్చ సలుపుచు నెట్లు లజ్జగనకుంద్రు?
ముక్తాఫలసదృశముగను కావ్యము స్వ
భావవిమలము, సువర్ణసంఘటిత
మై శ్రోతృకర్ణకుహరమునయందు
పడి ప్రకటితమయి పడయు ప్రశస్తి.
ఈ విషయము మాత్ర మెంతయు స్ఫుటము:
గాథల హృదయమ్ము, కాంతల హృదియు
నరసికులగువారి కందవు పుణ్య
రహితులకు ధనము లభియింపనట్లు.
గాథలందు, మధురగానమ్ములందును,
వాద్య తంత్రికారవమ్ములందు,
ప్రౌఢమహిళలందు రసము నెరుగనట్టి
యరసికులగువారి కదియ శిక్ష...........
© 2017,www.logili.com All Rights Reserved.