అష్టాదశ పురాణాలలో అగ్ని పురాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో నారద పురాణం చెప్పిన విష్యానుక్రమణిక యధాతధంగా ఉన్నది. దీని వక్త అగ్ని. శ్రోత వసిష్టుడు. ఇందులో ఈశానుకల్ప వృతాంతం ఉన్నది. ఆధునికులు అగ్ని పురాణాన్ని భారతీయుల సమస్త విజ్ఞానకోశం అంటున్నారు. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పురాణాల ముఖ్య ఉద్దేశ్యం భారతీయ విద్యలను జనసామాన్యం చేరువలోనికి తీసుకోనిరావటమే అనిపిస్తుంది. ఇందులోని 383 అధ్యాయాలలో అనేక విషయాలు వివరించటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో అవతారతత్వంతో పాటు రామాయణ మహాభారత హరివంశ కధలసారం ఇవ్వబడింది. అనేక విధాలైన దేవాలయాల నిర్మాణ కళలను వివరించటంతో పాటు విగ్రహ ప్రతిష్ట పూజావిధానం మొదలైన వాటిని గురించి విస్తృతంగా వివరించబడినది. నాలుగు ఉపవేదాలు, వేదాంగాలు, తాత్విక, దార్శనిక విషయాలు మాత్రమే గాకుండా పశుచికిత్స, ధర్మ శాస్త్ర, రాజనీతి, ఆయుర్వేదం మొదలైన శాస్త్రాల విషయాలతో పాటు అలంకార శాస్త్ర విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. చందశాస్త్రం 8 అధ్యాయాలలో వివరించబడింది.
వ్యాకరణ శాస్త్ర క్లుప్తీకరణ చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. కౌమార వ్యాకరణం అనే పేరుతో ఒక చిన్న వ్యాకరణము, ఏకాక్షర కోశము, నామలింగానుశాసనము, యోగశాస్త్ర అంగాల వివేచనము అద్వైత వేదాంతసారము ఇందులో సమకూర్చబడ్డాయి. ఈ విధంగా అగ్ని పురాణంలో భారతీయ సాహిత్యము, సంస్కృతులకు సంబంధించిన అన్ని విషయాలు సంక్షిప్త రూపంలో సంకలనం చేయబడ్డాయి.
ఈ పురాణ శ్రవణం లేక మననం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. నేడు లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి.
అష్టాదశ పురాణాలలో అగ్ని పురాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో నారద పురాణం చెప్పిన విష్యానుక్రమణిక యధాతధంగా ఉన్నది. దీని వక్త అగ్ని. శ్రోత వసిష్టుడు. ఇందులో ఈశానుకల్ప వృతాంతం ఉన్నది. ఆధునికులు అగ్ని పురాణాన్ని భారతీయుల సమస్త విజ్ఞానకోశం అంటున్నారు. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పురాణాల ముఖ్య ఉద్దేశ్యం భారతీయ విద్యలను జనసామాన్యం చేరువలోనికి తీసుకోనిరావటమే అనిపిస్తుంది. ఇందులోని 383 అధ్యాయాలలో అనేక విషయాలు వివరించటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో అవతారతత్వంతో పాటు రామాయణ మహాభారత హరివంశ కధలసారం ఇవ్వబడింది. అనేక విధాలైన దేవాలయాల నిర్మాణ కళలను వివరించటంతో పాటు విగ్రహ ప్రతిష్ట పూజావిధానం మొదలైన వాటిని గురించి విస్తృతంగా వివరించబడినది. నాలుగు ఉపవేదాలు, వేదాంగాలు, తాత్విక, దార్శనిక విషయాలు మాత్రమే గాకుండా పశుచికిత్స, ధర్మ శాస్త్ర, రాజనీతి, ఆయుర్వేదం మొదలైన శాస్త్రాల విషయాలతో పాటు అలంకార శాస్త్ర విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. చందశాస్త్రం 8 అధ్యాయాలలో వివరించబడింది. వ్యాకరణ శాస్త్ర క్లుప్తీకరణ చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. కౌమార వ్యాకరణం అనే పేరుతో ఒక చిన్న వ్యాకరణము, ఏకాక్షర కోశము, నామలింగానుశాసనము, యోగశాస్త్ర అంగాల వివేచనము అద్వైత వేదాంతసారము ఇందులో సమకూర్చబడ్డాయి. ఈ విధంగా అగ్ని పురాణంలో భారతీయ సాహిత్యము, సంస్కృతులకు సంబంధించిన అన్ని విషయాలు సంక్షిప్త రూపంలో సంకలనం చేయబడ్డాయి. ఈ పురాణ శ్రవణం లేక మననం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. నేడు లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.