వీరు ది. 11-6-1930న కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నంలో జన్మించినారు. 1949-50 లో స్కూలు ఫైనలు చదివి అంతటితో స్కూలు చదువు ఆపుచేసినారు. 1954లో డ్రాయింగు బోర్డు హయ్యరు పరీక్షలు వ్రాసి పాసయినారు. 1955లో డ్రాయింగు టీచర్సు ట్రైనింగ్ కోర్సుకు వెళ్ళి అది పాసయినారు. తరువాత కృష్ణాజిల్లా పరిషత్తు హైస్కూలులో 1955 నుండి డ్రాయింగు టీచరుగా పనిచేసినారు. టీచరుగా పనిచేస్తూనే 1968లో హోమియోపతి బోర్డు బి క్లాసు పరీక్షలు వ్రాసి అది పాసయినారు. చిత్రలేఖనం, హోమియో వైద్యం ఇవి రెండూ వీరికి చాలా ఇష్టం. వీరికి సేవా భావం ఇష్టమైనందున తరువాత హోమియో వైద్యాన్ని చేపట్టారు. స్కూలు టీచరు ఉద్యోగమును విరమించి 1969లో నందిగామలో శ్రీ బాలాజీ హోమియో క్లినిక్ ను ప్రారంభించి హోమియో ప్రాక్టీసు చేయుచున్నారు. 1990లో విజయవాడలో కూడా శ్రీ బాలాజీ హోమియో క్లినిక్ ను ప్రారంభించి హోమియో ప్రాక్టీసు చేయుచున్నారు. ఇప్పుడు ఈ రెండు చోట్ల రెండు క్లినిక్ లను వారి ఇద్దరు పిల్లలు చూచుచున్నారు. వీరు వయస్సును బట్టి వైద్య వృత్తిని విరమించినారు. హోమియో వైద్య విజ్ఞానాన్ని అందరికి అందచేయాలన్నది వీరి ఆకాంక్ష. అందుకే ఈ రచనను చేసి మనకు అందించినారు. చదువుకొనండి, నేర్చుకొనండి, గృహ వైద్యం చేసుకొనవచ్చు.
వీరు ది. 11-6-1930న కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నంలో జన్మించినారు. 1949-50 లో స్కూలు ఫైనలు చదివి అంతటితో స్కూలు చదువు ఆపుచేసినారు. 1954లో డ్రాయింగు బోర్డు హయ్యరు పరీక్షలు వ్రాసి పాసయినారు. 1955లో డ్రాయింగు టీచర్సు ట్రైనింగ్ కోర్సుకు వెళ్ళి అది పాసయినారు. తరువాత కృష్ణాజిల్లా పరిషత్తు హైస్కూలులో 1955 నుండి డ్రాయింగు టీచరుగా పనిచేసినారు. టీచరుగా పనిచేస్తూనే 1968లో హోమియోపతి బోర్డు బి క్లాసు పరీక్షలు వ్రాసి అది పాసయినారు. చిత్రలేఖనం, హోమియో వైద్యం ఇవి రెండూ వీరికి చాలా ఇష్టం. వీరికి సేవా భావం ఇష్టమైనందున తరువాత హోమియో వైద్యాన్ని చేపట్టారు. స్కూలు టీచరు ఉద్యోగమును విరమించి 1969లో నందిగామలో శ్రీ బాలాజీ హోమియో క్లినిక్ ను ప్రారంభించి హోమియో ప్రాక్టీసు చేయుచున్నారు. 1990లో విజయవాడలో కూడా శ్రీ బాలాజీ హోమియో క్లినిక్ ను ప్రారంభించి హోమియో ప్రాక్టీసు చేయుచున్నారు. ఇప్పుడు ఈ రెండు చోట్ల రెండు క్లినిక్ లను వారి ఇద్దరు పిల్లలు చూచుచున్నారు. వీరు వయస్సును బట్టి వైద్య వృత్తిని విరమించినారు. హోమియో వైద్య విజ్ఞానాన్ని అందరికి అందచేయాలన్నది వీరి ఆకాంక్ష. అందుకే ఈ రచనను చేసి మనకు అందించినారు. చదువుకొనండి, నేర్చుకొనండి, గృహ వైద్యం చేసుకొనవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.