ప్రస్తుత కాలంలో అన్ని భాషల్లోకీ ఇంగ్లీషు భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో మాట్లాడడం గొప్పగా భావిస్తున్నారు. చివరికి నిరక్షరాస్యుడైనా తన కుమారుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే పొంగిపోతాడు, గర్వపడతాడు.
ఇంగ్లీషు మాట్లాడడం అంత కష్టమైనదేమీ కాదు. కొన్ని మెలకువలు తెలిసి నేర్చుకుంటే సులభంగా మాట్లాడవచ్చు. ఇంగ్లీషు వాళ్ళు ఉచ్చరించినట్లు మనం ఉచ్ఛరించలేకపోవచ్చు. అలా ఉచ్ఛరించవలసిన అవసరం కూడా లేదు. మన భావం ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడ గలిగితే చాలు. అయితే ఇంగ్లీషు రాయడానికి చదవడానికి తేడా ఉంది. రాసేటప్పుడు, పదంయొక్క spelling (స్పెల్లింగ్) (అంటే ఒక అక్షరం తరువాత యింకొక అక్షరాన్ని చేర్చి రాయడం)కీ, ఉచ్చారణకీ భేదం ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. Knife అనే పదం ఉంది. దీని స్పెల్లింగ్ knife. కాని దీనిని "క్నైఫ్” అని పలకకూడదు. 'నైఫ్” అని పలకాలి. అంటే దీనిలో "K" అనే అక్షరాన్ని పలకవలసిన అవసరం లేదు. ఇలాంటి లక్షరాలు కొన్ని ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో అన్ని భాషల్లోకీ ఇంగ్లీషు భాషకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో మాట్లాడడం గొప్పగా భావిస్తున్నారు. చివరికి నిరక్షరాస్యుడైనా తన కుమారుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటే పొంగిపోతాడు, గర్వపడతాడు. ఇంగ్లీషు మాట్లాడడం అంత కష్టమైనదేమీ కాదు. కొన్ని మెలకువలు తెలిసి నేర్చుకుంటే సులభంగా మాట్లాడవచ్చు. ఇంగ్లీషు వాళ్ళు ఉచ్చరించినట్లు మనం ఉచ్ఛరించలేకపోవచ్చు. అలా ఉచ్ఛరించవలసిన అవసరం కూడా లేదు. మన భావం ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడ గలిగితే చాలు. అయితే ఇంగ్లీషు రాయడానికి చదవడానికి తేడా ఉంది. రాసేటప్పుడు, పదంయొక్క spelling (స్పెల్లింగ్) (అంటే ఒక అక్షరం తరువాత యింకొక అక్షరాన్ని చేర్చి రాయడం)కీ, ఉచ్చారణకీ భేదం ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. Knife అనే పదం ఉంది. దీని స్పెల్లింగ్ knife. కాని దీనిని "క్నైఫ్” అని పలకకూడదు. 'నైఫ్” అని పలకాలి. అంటే దీనిలో "K" అనే అక్షరాన్ని పలకవలసిన అవసరం లేదు. ఇలాంటి లక్షరాలు కొన్ని ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.