ప్రపంచంలో మాట్లాడే అన్ని భాషల్లోనూ ఇంగ్లీషుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇది అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది. అన్ని దేశాల్లోనూ ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. అయితే ఏ దేశంవారు ఆ దేశపు మాతృభాషని ఎలా పలుకుతారో ఇంగ్లీషుని కూడా అలాగే ఉచ్చరిస్తున్నారు. వాళ్ళు ఉచ్చరించే తీరుని బట్టి వారు ఏ దేశానికీ , ఏ ప్రాంతానికి చెందినవారో కూడా కనిపెట్టవచ్చు. తమిళులు ఒక విధంగా ఉచ్చరిస్తే, బెంగాలీలు ఇంకో విధంగా ఉచ్ఛరిస్తారు. ఆంధ్రులు మరో విధంగా ఉచ్ఛరిస్తారు. అసలు ఇంగ్లీషువాళ్ళే వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్ని బట్టి ఉచ్చారణ చేస్తూ ఉంటారు. అయితే వారి ప్రాంతీయ "యాస" ల్ని అధ్యయనం చేసి, ఒక ప్రామాణికమైన భాషని, ఉచ్చారణని రూపొందించారు.