ప్రవేశిక-అవసరమైన వివరణలు
ఆధునిక సాహిత్య విమర్శ అంటే సాహిత్యేతర విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాలనూ, వాటికి సంబంధించిన ప్రయోగ శిల్పాలనూ సాహిత్యపు లోతులు చూడడానికి వినియోగించుకునే పద్ధతి. ఈ రీత్యా ఆధునిక సాహిత్య విమర్శ అనేది చాలా సంక్లిష్టమైన, క్లిష్టతరమైన కార్యం. తెలుగులో ఆధునిక సాహిత్య సృజన ఎప్పుడు మొదలైందో అప్పుడే ఆధునిక సాహిత్య విమర్శ మొదలైందని చెప్పవచ్చు. 20వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పరిణామాలతో పాటు తెలుగు సాహిత్య రంగంలోకి ఆధునికత ప్రవేశించింది. ఆరంభ దశలోనే ఆధునికధోరణులకు సంబంధించిన విభిన్న అంశాలు సాహిత్య విమర్శలో పొడసూపాయి. ముఖ్యంగా ఆధునిక సాహిత్య రూపాన్ని బలంగా ప్రతిపాదించడానికి గురజాడతోనే తొలి ప్రయత్నం జరిగింది. సాహిత్య విమర్శకు వస్తువు, రూపం రెండూ అనివార్యమైన అంశాలని భావిస్తే వాటికి సంబంధించిన మౌలిక భావనల వికాసంతోనే ఆధునిక సాహిత్య విమర్శ మొదలైంది. అందుకే వస్తు తత్త్వాన్ని గుర్తెరిగిన గురజాడ కవిత్వరూపాన్ని సరళీకరించడానికి ముత్యాలసరానికి సంబంధించి కొత్త అన్వేషణను ప్రారంభించాడు. ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభ దశలో ఇదొక గుణాత్మకమైన
పరిణామం.
ఆధునికత కేవలం భౌతికమైన పరిణామం కాదు. సామాజిక వైయక్తిక చైతన్యాన్ని ప్రభావితం చేసిన ఒక దృక్పథం. ఈ ప్రభావం వల్ల సాంప్రదాయికంగా అప్పటి వరకు ఉనికిలో ఉన్న అనేక రకాల తాత్త్విక సాయి సామాజిక భావనలు మౌలికంగా మారాయి. కాబట్టే ఆధునికతను దృక్పథంగా నిర్దిష్ట పరిచే అంశాలన్నీ సాహిత్య విమర్శ స్వభావంలో భాగమవుతాయి. భౌతికమైన మార్పును గుర్తించడం ఆధునిక విమర్శ తొలి లక్షణంగా భావించవచ్చు..................
ప్రవేశిక-అవసరమైన వివరణలు ఆధునిక సాహిత్య విమర్శ అంటే సాహిత్యేతర విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాలనూ, వాటికి సంబంధించిన ప్రయోగ శిల్పాలనూ సాహిత్యపు లోతులు చూడడానికి వినియోగించుకునే పద్ధతి. ఈ రీత్యా ఆధునిక సాహిత్య విమర్శ అనేది చాలా సంక్లిష్టమైన, క్లిష్టతరమైన కార్యం. తెలుగులో ఆధునిక సాహిత్య సృజన ఎప్పుడు మొదలైందో అప్పుడే ఆధునిక సాహిత్య విమర్శ మొదలైందని చెప్పవచ్చు. 20వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక పరిణామాలతో పాటు తెలుగు సాహిత్య రంగంలోకి ఆధునికత ప్రవేశించింది. ఆరంభ దశలోనే ఆధునికధోరణులకు సంబంధించిన విభిన్న అంశాలు సాహిత్య విమర్శలో పొడసూపాయి. ముఖ్యంగా ఆధునిక సాహిత్య రూపాన్ని బలంగా ప్రతిపాదించడానికి గురజాడతోనే తొలి ప్రయత్నం జరిగింది. సాహిత్య విమర్శకు వస్తువు, రూపం రెండూ అనివార్యమైన అంశాలని భావిస్తే వాటికి సంబంధించిన మౌలిక భావనల వికాసంతోనే ఆధునిక సాహిత్య విమర్శ మొదలైంది. అందుకే వస్తు తత్త్వాన్ని గుర్తెరిగిన గురజాడ కవిత్వరూపాన్ని సరళీకరించడానికి ముత్యాలసరానికి సంబంధించి కొత్త అన్వేషణను ప్రారంభించాడు. ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభ దశలో ఇదొక గుణాత్మకమైన పరిణామం. ఆధునికత కేవలం భౌతికమైన పరిణామం కాదు. సామాజిక వైయక్తిక చైతన్యాన్ని ప్రభావితం చేసిన ఒక దృక్పథం. ఈ ప్రభావం వల్ల సాంప్రదాయికంగా అప్పటి వరకు ఉనికిలో ఉన్న అనేక రకాల తాత్త్విక సాయి సామాజిక భావనలు మౌలికంగా మారాయి. కాబట్టే ఆధునికతను దృక్పథంగా నిర్దిష్ట పరిచే అంశాలన్నీ సాహిత్య విమర్శ స్వభావంలో భాగమవుతాయి. భౌతికమైన మార్పును గుర్తించడం ఆధునిక విమర్శ తొలి లక్షణంగా భావించవచ్చు..................© 2017,www.logili.com All Rights Reserved.