'కవి గానివాడు విమర్శకుడౌతాడు' - ఇదొక నానుడి. అయితే కవులే విమర్శకులు కావాల్సిన పరిస్థితి తెలుగునేలకే ప్రత్యేకం. కవిత్వం, విమర్శ పరస్పర విరుద్దాంశాలు కానప్పటికీ ఒకటి ఉద్వేగ ప్రధానం, మరొకటి బౌద్ధిక వ్యాపారం. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి సామరస్య పూర్వక సమన్వయం సాధించడం, దానికి ప్రణాళికాబద్ధమైన పరిశోధనని జోడించడం తెలిసి తెలిసీ రోట్లో తలదూర్చడమే. అయినా సాహసించడం నిరంకుశ కవులకు ఒక క్రీడ. ఆ క్రీడలో గెలుపుని సొంతం చేసుకొన్నవాళ్ళలో కవి యాకూబ్ ఒకడు.
నిన్నటి చేరా ఇవాల్టి అఫ్సర్, ప్రసేన్, సీతారాం వంశీ కృష్ణ. ఖమ్మం నేలకే రెండంచుల కత్తుల్ని సృజించే ప్రత్యేకమైన గుణముందేమో! ఆ నేలనుంచే మరో బలమైన చేర్పు యాకూబ్. ప్రవహించే జ్ఞాపకాన్నీ, రారా సాహిత్య పరిశోధననీ ఏకకాలంలో సవ్యసాచిగా తవ్విపోసి అందించిన యాకూబ్, కవిగా పరిశోధకుడిగా జోడు గుర్రాల స్వారీని కాదు స్వారీని అలవోకగా అతి జాగరూకతతో నిర్వహిస్తున్నాడనడానికి ఆధునిక సాహిత్య విమర్శలోని వాదాలనూ, ధోరణులనూ సమగ్రంగా గుదిగుచ్చి అందించిన ఈ గ్రంథమే సాక్ష్యం.
'కవి గానివాడు విమర్శకుడౌతాడు' - ఇదొక నానుడి. అయితే కవులే విమర్శకులు కావాల్సిన పరిస్థితి తెలుగునేలకే ప్రత్యేకం. కవిత్వం, విమర్శ పరస్పర విరుద్దాంశాలు కానప్పటికీ ఒకటి ఉద్వేగ ప్రధానం, మరొకటి బౌద్ధిక వ్యాపారం. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి సామరస్య పూర్వక సమన్వయం సాధించడం, దానికి ప్రణాళికాబద్ధమైన పరిశోధనని జోడించడం తెలిసి తెలిసీ రోట్లో తలదూర్చడమే. అయినా సాహసించడం నిరంకుశ కవులకు ఒక క్రీడ. ఆ క్రీడలో గెలుపుని సొంతం చేసుకొన్నవాళ్ళలో కవి యాకూబ్ ఒకడు. నిన్నటి చేరా ఇవాల్టి అఫ్సర్, ప్రసేన్, సీతారాం వంశీ కృష్ణ. ఖమ్మం నేలకే రెండంచుల కత్తుల్ని సృజించే ప్రత్యేకమైన గుణముందేమో! ఆ నేలనుంచే మరో బలమైన చేర్పు యాకూబ్. ప్రవహించే జ్ఞాపకాన్నీ, రారా సాహిత్య పరిశోధననీ ఏకకాలంలో సవ్యసాచిగా తవ్విపోసి అందించిన యాకూబ్, కవిగా పరిశోధకుడిగా జోడు గుర్రాల స్వారీని కాదు స్వారీని అలవోకగా అతి జాగరూకతతో నిర్వహిస్తున్నాడనడానికి ఆధునిక సాహిత్య విమర్శలోని వాదాలనూ, ధోరణులనూ సమగ్రంగా గుదిగుచ్చి అందించిన ఈ గ్రంథమే సాక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.