వీరు 1926లో గుంటూరు జిల్లా, బాపట్లలో సంప్రదాయ వైష్ణవ కుటుంబమున జన్మించిరి. తండ్రిగారి నుండి వేదము, పురాణములు, ధర్మశాస్త్రము, యోగము, జ్యోతిషము, ఆయుర్వేదము అభ్యసించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి తెలుగు భాష యందు ఎం.ఏ., పిహెచ్.డి. డిగ్రీలను పొంది 1974 వరకు అధ్యాపకులుగా పనిచేసిరి. తెలుగు, సంస్కృతము, ఆంగ్లములలో గద్య, పద్య, నాటక నవలా రచనలు చేసిరి. ప్రాక్పశ్చిమ సమన్వయమునకై పలుమార్లు పాశ్చాత్య ఖండములలో పర్యటించిరి. మనదేశమునందును, పాశ్చాత్య ఖండములందును వేలమంది శిష్యులకు ఆచార్యత్వము వహించిరి. నవయుగ వైద్య విధానమును రూపొందించి అసంఖ్యాకములైన ఉచిత హోమియో వైద్యాలయములను నెలకొల్పి అశేష రోగార్తుల బాధలను తొలగించిరి. అనేక గ్రంథములు మరియు ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మిక విద్యను ప్రపంచమునకు అందించిరి.

© 2017,www.logili.com All Rights Reserved.