రచయితలు-20 గురించి రాసిన ఈ వ్యాసాల్లో ఎక్కువ భాగం 1982-1992 మధ్య రాసినవి. ప్రధానంగా ఆంధ్రప్రభ దినపత్రిక, తర్వాత రచన మాసపత్రికల్లో అచ్చయినవి. ఇలా నా చేత పట్టు పట్టి రాయించిన వాళ్లు ముఖ్యంగా అజంతా, వాసుదేవదీక్షితులు. దీనిలో రావిశాస్త్రి -1, త్రిపుర -2, శిఖామణి గురించి రాసిన వ్యాసాలూ జులై 30, త్రిపుర కథలు, మవ్వల చేతికర్ర ప్రచురణ అయిన ఆయా సందర్భాల్లో రాసినవి. దేవరకొండ బాలగంగాధరతిలక్, వెల్చేరు నారాయణరావు గురించి రాసినవి ఎక్కడా అచ్చవలేదు. రావిశాస్త్రి-1, ఎం. ఆదినారాయణ గురించి పరకాయ ప్రవేశం చేసి రాసినవి.
ఈ వ్యాసాలూ అచ్చయిన సందర్భం, కాలం వేరు. ఇప్పుడు ఇవన్నీ పుస్తక రూపంలో వస్తున్నకాలం వేరు. ఈ మధ్యలో మరికొంత కథా కమామీషు జరుగుతుంది కదా!అలా జరిగిందాన్ని వ్యాసం చివర్లో తర్వాత - అని రాసి కలిపాను. అందుకని అక్కడక్కడా కొనసాగింపు ఏమన్నా దెబ్బతింటే దానికి కారణం అదన్నమాట. దీన్ని పాఠకులు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
- అత్తలూరి నరసింహారావు
రచయితలు-20 గురించి రాసిన ఈ వ్యాసాల్లో ఎక్కువ భాగం 1982-1992 మధ్య రాసినవి. ప్రధానంగా ఆంధ్రప్రభ దినపత్రిక, తర్వాత రచన మాసపత్రికల్లో అచ్చయినవి. ఇలా నా చేత పట్టు పట్టి రాయించిన వాళ్లు ముఖ్యంగా అజంతా, వాసుదేవదీక్షితులు. దీనిలో రావిశాస్త్రి -1, త్రిపుర -2, శిఖామణి గురించి రాసిన వ్యాసాలూ జులై 30, త్రిపుర కథలు, మవ్వల చేతికర్ర ప్రచురణ అయిన ఆయా సందర్భాల్లో రాసినవి. దేవరకొండ బాలగంగాధరతిలక్, వెల్చేరు నారాయణరావు గురించి రాసినవి ఎక్కడా అచ్చవలేదు. రావిశాస్త్రి-1, ఎం. ఆదినారాయణ గురించి పరకాయ ప్రవేశం చేసి రాసినవి. ఈ వ్యాసాలూ అచ్చయిన సందర్భం, కాలం వేరు. ఇప్పుడు ఇవన్నీ పుస్తక రూపంలో వస్తున్నకాలం వేరు. ఈ మధ్యలో మరికొంత కథా కమామీషు జరుగుతుంది కదా!అలా జరిగిందాన్ని వ్యాసం చివర్లో తర్వాత - అని రాసి కలిపాను. అందుకని అక్కడక్కడా కొనసాగింపు ఏమన్నా దెబ్బతింటే దానికి కారణం అదన్నమాట. దీన్ని పాఠకులు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. - అత్తలూరి నరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.