సూక్తి అంటే సుభాషితం. మంచి మాట అన్న మాట. మంచిమాటకు ఎంతవిలువా, శక్తీ ఉంటాయో చెప్పలేం. సూక్తులు ప్రధానంగా నీతిని బోధిస్తాయి. ఉన్మార్గగాములైన వారికి సన్మార్గాన్ని ఉపదేశించి వారి జీవితాలకొక దీప్తిని కలిగిస్తాయి. చెడుమార్గంలో నడుస్తున్న ఒక వ్యక్తి ఎదుట అతని దుష్ప్రవర్తనను గూర్చి ఒక సూక్తిని మనం వినిపిస్తే అతడు తన ప్రవర్తనకు లోలోన ఎంతో సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. సన్మార్గంలో నడవడానికి కొంతైనా ప్రయత్నిస్తాడు. ఎంతో లోకానుభవాన్ని పండించుకొని విజ్ఞులు చెప్పినవి సూక్తులు. తన జీవితమంతా అనుభించిన ఒక సత్యాన్ని అనుభవజ్ఞుడు ఒక చిన్న సూక్తితో ప్రకటింపజేస్తున్నాడు.
అంటే ఒక చిన్న సూక్తిలో ఒక వ్యక్తి జీవితానుభావమంతా నిండి ఉన్నదన్న మాట. ఆ దృష్టితో చూస్తె సూక్తులకెంత ప్రాధాన్యముందో అవగతమౌతుంది. కనుకనే కవులు విశ్వశ్రేయ ప్రధానాలైన తమ కావ్యాలలో సందర్భానుగుణంగా ఎన్నెన్నో సూక్తిరత్నాలను పొదివి మనకు అందించినారు. ఈ సూక్తులు మానవుని జీవితంలోని అన్ని కోణాలకూ సంబంధించిన అతని జీవితస్థాయిని సంస్కరించుకొని సమున్నతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.
సూక్తి అంటే సుభాషితం. మంచి మాట అన్న మాట. మంచిమాటకు ఎంతవిలువా, శక్తీ ఉంటాయో చెప్పలేం. సూక్తులు ప్రధానంగా నీతిని బోధిస్తాయి. ఉన్మార్గగాములైన వారికి సన్మార్గాన్ని ఉపదేశించి వారి జీవితాలకొక దీప్తిని కలిగిస్తాయి. చెడుమార్గంలో నడుస్తున్న ఒక వ్యక్తి ఎదుట అతని దుష్ప్రవర్తనను గూర్చి ఒక సూక్తిని మనం వినిపిస్తే అతడు తన ప్రవర్తనకు లోలోన ఎంతో సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. సన్మార్గంలో నడవడానికి కొంతైనా ప్రయత్నిస్తాడు. ఎంతో లోకానుభవాన్ని పండించుకొని విజ్ఞులు చెప్పినవి సూక్తులు. తన జీవితమంతా అనుభించిన ఒక సత్యాన్ని అనుభవజ్ఞుడు ఒక చిన్న సూక్తితో ప్రకటింపజేస్తున్నాడు. అంటే ఒక చిన్న సూక్తిలో ఒక వ్యక్తి జీవితానుభావమంతా నిండి ఉన్నదన్న మాట. ఆ దృష్టితో చూస్తె సూక్తులకెంత ప్రాధాన్యముందో అవగతమౌతుంది. కనుకనే కవులు విశ్వశ్రేయ ప్రధానాలైన తమ కావ్యాలలో సందర్భానుగుణంగా ఎన్నెన్నో సూక్తిరత్నాలను పొదివి మనకు అందించినారు. ఈ సూక్తులు మానవుని జీవితంలోని అన్ని కోణాలకూ సంబంధించిన అతని జీవితస్థాయిని సంస్కరించుకొని సమున్నతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.