శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో భాషా విజ్ఞానానికి, నామ విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలే కాక విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సాహించారు. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విభిన్న ప్రక్రియలను, ధోరణులను, ప్రాంతీయతను, ప్రసక్తమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నూతనమూ, వైవిధ్య భారితములూ అయిన పెక్కు పరిశోధనలు ఈ శాఖలో జరిగాయి.
ప్రక్రియాపరంగా పోల్చి చూసినపుడు ఆధునిక కవిత్వం పై అధికసంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆధునిక కవిత్వానికి సంబంధించి ఆచార్య సుబ్బారెడ్డిగారి "ఆధునిక కవిత్వం పై జాతీయోద్యమ ప్రభావం" ఈ శాఖలో వెలువడిన మొదటి సిద్ధాంత గ్రంథంగా పరిగణించవచ్చు. ఇది మొట్టమొదటి వాడుక భాషలో రచించిన సిద్ధాంత గ్రంథంగా మార్గదర్శకత వహిస్తూ ఉంది.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో భాషా విజ్ఞానానికి, నామ విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలే కాక విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సాహించారు. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విభిన్న ప్రక్రియలను, ధోరణులను, ప్రాంతీయతను, ప్రసక్తమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నూతనమూ, వైవిధ్య భారితములూ అయిన పెక్కు పరిశోధనలు ఈ శాఖలో జరిగాయి. ప్రక్రియాపరంగా పోల్చి చూసినపుడు ఆధునిక కవిత్వం పై అధికసంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆధునిక కవిత్వానికి సంబంధించి ఆచార్య సుబ్బారెడ్డిగారి "ఆధునిక కవిత్వం పై జాతీయోద్యమ ప్రభావం" ఈ శాఖలో వెలువడిన మొదటి సిద్ధాంత గ్రంథంగా పరిగణించవచ్చు. ఇది మొట్టమొదటి వాడుక భాషలో రచించిన సిద్ధాంత గ్రంథంగా మార్గదర్శకత వహిస్తూ ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.