“నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది.
“అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను.
ఖాళీ ఐన బీరుమగ్గును - ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, "పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ..... దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.”
వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు.
“ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ”
నా కేసి నిశితంగా చూశాడు - నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని,
"ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే - తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో.............
1. చేజారిన సిరి “నా మేనమామ తన తదనంతరం ఆస్తి సర్వస్వం నాకు చెందేలా వీలునామా రాసిపోయాడు.” అని చెబుతున్న టెడ్ కోటు చేతివైపు చూశాను. అది మెరిసిపోతూ వుంది. అక్కడ నుంచి నా చూపులు అతని కాలర్ కేసి సారించాను. పలుమార్లు ఉతకడం వల్ల దాని రంగు వెలిసిపోయి ఉంది. తరువాత కాంతివంతమైన అతని కళ్ళవంక నా చూపులు ప్రసరించాయి. ఆ కళ్ళలో ఏదో కోల్పోయిన భావన కదలాడినట్లు తోచింది. “అలాంటి అదృష్టం నాకు లేదు” అన్నాన్నేను. ఖాళీ ఐన బీరుమగ్గును - ఎర్రటిముక్కుకిందున్న వెండితీగెల్లాంటి మీసాలకు తాకిస్తూ, "పోనీలెండి! అనుకోకుండా ప్రాప్తించే నడమంత్రపుసిరి ఏమంత మేలుచేయదు ..... దివంగతుడైన అంకుల్ ఒక రచయిత. చాలా పుస్తకాలు రాసి ప్రచురణ చేయించాడు.” వేదాంత ధోరణి, విరక్తిభావం కలగా పులగంగా కలసి ఉన్నాయా మాటల్లో. ఒకసారి దీర్ఘంగా నిశ్వసించి, తిరిగి అతనే మాట్లాడాడు. “ఆ పుస్తకాలే నాకు కలిగిన ఇబ్బందులకు కారణమయ్యాయి. ” నా కేసి నిశితంగా చూశాడు - నేను అతని మాటల్ని అర్థం చేసుకున్నానో లేదో అన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకన్నట్లు. అతడు పెదవుల్ని నాలుకతో తడుపుకొని, "ఆయన నాకు తల్లివైపునుంచి బంధువవుతాడు. అయితే అంకుల్కు ఒక బలహీనత ఉంది. అదేమంటే - తాను స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం. బలహీనత అన్నపదం సరిపోదు. ఉన్మాదం అంటే బాగుంటుంది. సాహిత్యమన్నా, సాహిత్యం సృష్టించడమన్నా మహా ఇష్టం. ఒక్కొక్కటి సుమారు ఆరువందల పేజీలతో, చాలా పుస్తకాలను వెలువరించాడు. వాటిలో తన స్వంత పైత్యాన్ని దట్టిస్తాడు. పైగా అది సమాజోద్ధారణకోసం రాశానని చెప్పుకుంటాడు. కానీ అందులో.............© 2017,www.logili.com All Rights Reserved.