ఈ గ్రంథం - సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వినగడించినతీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా ఉంది.
- డా ఎన్ గోపి
సాక్షివ్యాసాలూ షడ్రుచులతో గూడిన మృష్టాన్న భోజనమయితే ఈనా వ్యాఖ్యానం ఆ విందు ఆరగించబోయే ముందుగా స్వీకరించే Appetiser కాగలదు. ఇది పాఠకులకు నేను చేసే వాగ్దానం. కొందరు మిత్రులు దీనికి An introduction to Sakshi అని నామకరణం చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు రచయితలు సాక్షిలో వచ్చే జంఘాల శాస్త్రి హాస్యపాత్ర అని కొట్టిపారేసారు. సాక్షిలోవున్న సారస్యం వారికి అర్ధంకాక అలా అని వుంటారు. సాక్షిలో వున్న గాంభీర్యం వారికి తట్టలేదు. "లేకిశ్రీ" అనదగినవారికి "పద్మశ్రీ" ఇస్తే ఎంత అనౌచిత్యంగా వుంటుందో సాక్షిని చాలతేలికగా 'హాస్య రచన' అంటే అంత ఔచిత్య లేమిగా ఉంటుంది. రసహృదయులైన పాఠకులారా! మామిడి పళ్ళబుట్ట మీముందుంది. రసాలు స్వీకరించండి రసాస్వాదన చేయండి.
- తాళ్ళూరి లాబాన్ బాబు
ఈ గ్రంథం - సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వినగడించినతీరు, యుక్తియుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగా ఉంది. - డా ఎన్ గోపి సాక్షివ్యాసాలూ షడ్రుచులతో గూడిన మృష్టాన్న భోజనమయితే ఈనా వ్యాఖ్యానం ఆ విందు ఆరగించబోయే ముందుగా స్వీకరించే Appetiser కాగలదు. ఇది పాఠకులకు నేను చేసే వాగ్దానం. కొందరు మిత్రులు దీనికి An introduction to Sakshi అని నామకరణం చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు రచయితలు సాక్షిలో వచ్చే జంఘాల శాస్త్రి హాస్యపాత్ర అని కొట్టిపారేసారు. సాక్షిలోవున్న సారస్యం వారికి అర్ధంకాక అలా అని వుంటారు. సాక్షిలో వున్న గాంభీర్యం వారికి తట్టలేదు. "లేకిశ్రీ" అనదగినవారికి "పద్మశ్రీ" ఇస్తే ఎంత అనౌచిత్యంగా వుంటుందో సాక్షిని చాలతేలికగా 'హాస్య రచన' అంటే అంత ఔచిత్య లేమిగా ఉంటుంది. రసహృదయులైన పాఠకులారా! మామిడి పళ్ళబుట్ట మీముందుంది. రసాలు స్వీకరించండి రసాస్వాదన చేయండి. - తాళ్ళూరి లాబాన్ బాబు© 2017,www.logili.com All Rights Reserved.