నరజాతికి సేవాకార్యక్రమముల రూపమున సన్మార్గమును, క్రమశిక్షణమును మాస్టర్ ఇ.కె. నవ యుగమున బోధించిరి. నిస్వార్థబుద్ధితో, విశ్వప్రేమతో నడచి కొన్ని వేలమందిని నడిపించిరి. ఆత్మజ్ఞానమును ప్రసాదించి అనుయాయులను కార్యోన్ముఖులుగా తయారు చేసిరి. మానవజాతి కళ్యాణార్థమై వేదవిద్య, యోగవిద్యలతో పాటు వైద్యవిద్యను కూడ పంచిపెట్టిరి. మాస్టర్ హోమియో వైద్యాలయములను, బాలభాను విద్యాలయములను నెల కొల్పిరి. శాశ్వత జ్ఞానమును వ్యాపింపచేయుటకు అనేక గ్రంథములను రచించిరి. సామూహిక సహజీవనములో గల మాధుర్యము ననుభవింప చేయుటకు 1962లో తమ గురుదేవులైన “మాస్టర్ సి.వి.వి.” పేరిట గురుపూజా ఉత్సవములను ప్రారంభించిరి. 1972లో “నావాణి", దర్శన మాసపత్రికను స్థాపించిరి. ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయమును సాధించుటకై “ది వరల్డ్ టీచర్ ట్రస్ట్" (జగద్గురుపీఠము)ను 1971 సం||లో స్థాపించిరి, ఏడు పర్యాయములు పశ్చిమ ఖండములలో ఆధ్యాత్మిక ఉద్దీపన యాత్ర చేసిరి. అంతర్యామి స్వరూపులై వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వము ననుగ్రహించుచున్నారు.

© 2017,www.logili.com All Rights Reserved.