కె.కె. రంగనాథాచార్యులు వివిధ సందర్భాలలో, మాధ్యమాలలో వెలువరించిన వ్యాసాల సంకలనం ఇది. సమకాలంలో వస్తున్న భాషా సాహిత్య విమర్శ వ్యాసాలకివి విభిన్నంగ కనిపిస్తాయి. సమకాలిన విమర్శలో అరుదుగ కనిపించే సూక్ష్మపరిశీలన, సూటిదనం ఈ వ్యాసాల లక్షణాలు. బహుముఖీనమైన పరిజ్ఞానం, అధ్యయనం వ్యాసాలలో ప్రతిఫలిస్తాయి. చారిత్రక ద్రుష్టి, సామజిక దృక్పథం వ్యాసాలకు ప్రాసంగికతను కల్పిస్తాయి.
సంకలనంలోని వ్యాసాలు పీఠికలు కేవలం ఔపచారిక రచనలు కావు. వాటికి ఎత్తుగడ మొదలుకొని విషయ వివేచన వరకు ఒక సమగ్రతా లక్షణం ఉంది. విషయ సమగ్రత, శైలీ సాంద్రత, వివిధ కోణాలలో విశ్లేషణ వ్యాసాల ముఖ్యలక్షణాలు. పీఠికా రచనలో కూడా గ్రంధ సూక్ష్మపరిశీలన కనిపిస్తుంది. విషయవైపుల్యమూ, వైశద్యమూ, నైశిత్యమూ పీఠికల్లో వ్యక్తమవుతాయి. సాధారణంగా అలవోకగ సాగుతాయనుకునే రేడియో ప్రసంగవ్యాసాల్లో కూడా విషయగాధత కనిపిస్తుంది.
కె.కె. రంగనాధాచార్యులు(రచయిత గురించి) :
ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో అధ్యాపకులుగా, ప్రధానాధ్యాపకులు (1967 - 87)గా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులు (1987 - 2003)గా పనిచేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్ కి డీన్ గా కూడా ఉన్నారు.
కె.కె. రంగనాథాచార్యులు వివిధ సందర్భాలలో, మాధ్యమాలలో వెలువరించిన వ్యాసాల సంకలనం ఇది. సమకాలంలో వస్తున్న భాషా సాహిత్య విమర్శ వ్యాసాలకివి విభిన్నంగ కనిపిస్తాయి. సమకాలిన విమర్శలో అరుదుగ కనిపించే సూక్ష్మపరిశీలన, సూటిదనం ఈ వ్యాసాల లక్షణాలు. బహుముఖీనమైన పరిజ్ఞానం, అధ్యయనం వ్యాసాలలో ప్రతిఫలిస్తాయి. చారిత్రక ద్రుష్టి, సామజిక దృక్పథం వ్యాసాలకు ప్రాసంగికతను కల్పిస్తాయి. సంకలనంలోని వ్యాసాలు పీఠికలు కేవలం ఔపచారిక రచనలు కావు. వాటికి ఎత్తుగడ మొదలుకొని విషయ వివేచన వరకు ఒక సమగ్రతా లక్షణం ఉంది. విషయ సమగ్రత, శైలీ సాంద్రత, వివిధ కోణాలలో విశ్లేషణ వ్యాసాల ముఖ్యలక్షణాలు. పీఠికా రచనలో కూడా గ్రంధ సూక్ష్మపరిశీలన కనిపిస్తుంది. విషయవైపుల్యమూ, వైశద్యమూ, నైశిత్యమూ పీఠికల్లో వ్యక్తమవుతాయి. సాధారణంగా అలవోకగ సాగుతాయనుకునే రేడియో ప్రసంగవ్యాసాల్లో కూడా విషయగాధత కనిపిస్తుంది. కె.కె. రంగనాధాచార్యులు(రచయిత గురించి) : ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో అధ్యాపకులుగా, ప్రధానాధ్యాపకులు (1967 - 87)గా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులు (1987 - 2003)గా పనిచేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటిస్ కి డీన్ గా కూడా ఉన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.