"యోగం అంటేనే ధ్యానం. ధ్యానం వినా మరేది యోగం కాదు. మనసును దాటిపోవడాన్ని యోగంగా అభివర్ణిస్తారు. ధ్యానం మనసుకు పరిమితం కాదు. మనసును శూన్యం చేయడం ధ్యానంలో తోలి మజిలీ. శూన్యంలో ఆత్మచేతనను లయించడం మలి మజిలీ... అది తురీయం. భావరహితంగా, తానే విశ్వచైతన్యంగా మారడం మూడవ మజిలీ. అది తారకం. తారకంలో పరవశించి, పర్యవసించి మహర్షి కావచ్చు. ధ్యానమార్గంలో పయనించి పరవశిస్తూ పరమహంస స్థితికి చేరడం జ్ఞానక్షేత్రం. అదే మా లక్ష్యం... యోగ లక్షణం."
- మాస్టర్ శార్వరి
'వివేకానందం' అంటే తెలుసా!
ఆనందం అంటే తెలుసు.
బ్రహ్మానందం తెలుసు.
సచ్చిదానందం తెలుసు.
వివేకానందం కొత్తమాట... అర్థం తెలియదు.
'స్వామి వివేకానంద' పేరు విన్నారా?
పేరు తెలుసు ... అంతకు మించి కొంచెం తెలుసు.
'రామకృష్ణ పరమహంస' తెలుసా?
అవును స్వామి వివేకానందగారి గురువుగారు.
వివేకానందుడు నూరు సంవత్సరాల క్రితం ఎప్పుడో అమెరికా వెళ్లి చికాగో నగరంలో భారత ఆధ్యాత్మికత గురించి మాట్లాడాడు.
గౌతమ బుద్ధుడు తెలుసా?
తెలుసు.. భార్యను, కొడుకును, రాజ్యాన్ని, రాజ్యభోగాలనూ కాదని అరణ్యాలకు వెళ్లి తపస్సు చేశాడు. మనవాడే.
తమరు అసలు ఈ దేశంలోనే పుట్టారా?
నేనూ భారతీయుడినే!
"యోగం అంటేనే ధ్యానం. ధ్యానం వినా మరేది యోగం కాదు. మనసును దాటిపోవడాన్ని యోగంగా అభివర్ణిస్తారు. ధ్యానం మనసుకు పరిమితం కాదు. మనసును శూన్యం చేయడం ధ్యానంలో తోలి మజిలీ. శూన్యంలో ఆత్మచేతనను లయించడం మలి మజిలీ... అది తురీయం. భావరహితంగా, తానే విశ్వచైతన్యంగా మారడం మూడవ మజిలీ. అది తారకం. తారకంలో పరవశించి, పర్యవసించి మహర్షి కావచ్చు. ధ్యానమార్గంలో పయనించి పరవశిస్తూ పరమహంస స్థితికి చేరడం జ్ఞానక్షేత్రం. అదే మా లక్ష్యం... యోగ లక్షణం." - మాస్టర్ శార్వరి 'వివేకానందం' అంటే తెలుసా! ఆనందం అంటే తెలుసు. బ్రహ్మానందం తెలుసు. సచ్చిదానందం తెలుసు. వివేకానందం కొత్తమాట... అర్థం తెలియదు. 'స్వామి వివేకానంద' పేరు విన్నారా? పేరు తెలుసు ... అంతకు మించి కొంచెం తెలుసు. 'రామకృష్ణ పరమహంస' తెలుసా? అవును స్వామి వివేకానందగారి గురువుగారు. వివేకానందుడు నూరు సంవత్సరాల క్రితం ఎప్పుడో అమెరికా వెళ్లి చికాగో నగరంలో భారత ఆధ్యాత్మికత గురించి మాట్లాడాడు. గౌతమ బుద్ధుడు తెలుసా? తెలుసు.. భార్యను, కొడుకును, రాజ్యాన్ని, రాజ్యభోగాలనూ కాదని అరణ్యాలకు వెళ్లి తపస్సు చేశాడు. మనవాడే. తమరు అసలు ఈ దేశంలోనే పుట్టారా? నేనూ భారతీయుడినే!
© 2017,www.logili.com All Rights Reserved.