టిఎంఎస్ మార్క్సిస్టు సాహిత్య విమర్శను భూ మార్గం పటించాడు. పాశ్చాత్య మార్క్సిస్టు భావన మీద నిర్మాణమైన తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శను టిఎంఎస్ ప్రాదేశికం చేసాడు. ఆ మాటకొస్తే తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు నిచ్చాడు. సంప్రదాయ చట్రంలో మునిగిపోయిన విమర్శకు ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ దృక్పథాలను అద్దాడు. విమర్శ అంటే శిల్పం చుట్టూ తిరిగే అలంకారిక శైలిని కాదని, సాహిత్య వస్తువే విమర్శకు భూమికగా ఉండాలని టిఎంఎస్ నిర్ణయించాడు. సాహిత్య శిల్పాన్ని నిరాకరించడం కాదు, వస్తువును ఆశ్రయించిన శిల్పం గురించి అయన తపన.
-సి.కాసీం.