ఏరుముందా ? యేరో పౌర్ణం ముందా? అనుకుంటూ నిలబడ్డాడు రాజయ్య. నిన్న మంటలు జిమ్మిన సూరీడు మళ్ళీ రాబోతున్నాడు. సముద్రపు గాలికి ఇంటి ముందున్న వేపచెట్టు తల ఆడిస్తోంది.
రాజయ్య గూడెంలో పెత్తందారు. మాటా మంచీ వున్న మనిషి. అంటరాని వాడిగా అగ్రవర్ణాలవారు 'రాజిగా' అని పిలిస్తే ఆ పిలుపులో వున్న దోషం అతనికి తెలియదు. అలవాటైపోయిన ఆ పిలుపును కాదని ఎవరైనా 'రాజయ్యా !' అంటే ఏదో ప్రమాదం వచ్చినట్టుంటుంది.
ఎదురుగా కృష్ణా నదిలో సన్నజాలు వంకరలు తిరిగి నడుస్తోంది. వయ్యారాలు పోతూ నడుస్తోంది, ఉరకలేస్తూ నడుస్తోంది.
చిన్న పిల్లలు పాకుతున్నట్టు కదులుతోంది. రాజయ్య నది వంక చూసి తనలో తాను నవ్వుకున్నాడు. వేపమండ విరిచి ఆకులూ, ఈ నెలూ తీసివేశాడు. ముఖంపుల్ల నోట్లో పెట్టుకుని, నములుతూ నది వంకే చూస్తున్నాడు.
“ఇయ్యేడు యేరే ముందొచ్చేత్తుందనుకుంటా” నంటూ రాజయ్య భార్య రమణమ్మ మొగుడి పక్కకొచ్చి నిలబడింది.
రాజయ్య మాట్లాడలేదు. నదివంకే చూస్తూ నిలుచున్నాడు.
ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఆ నదిని అలా చూస్తూ నిలుచున్నా అతనికి విసుగనిపించదు.
ఆ ఇసుకా, ఆ బుసకా, ఆ లంకా, అటువైపు దూరంగా కనిపించే శ్రీకాకుళం, ఆపైన స్వామివారి గాలిగోపురం అతని కంటికి ఇంపుగా వుంటాయి. మనసుకు మంచిగా వుంటాయి.
ఆ నది ఏ రూపంలో వున్నా అతనికి ఆనందంగానే వుంటుంది.
రమణమ్మ మొగుడి చేయి కదిలించి, “ఎప్పుడు చూచినా అట్లా ఆ నదివంక చూత్తావు. అక్కడ నీకేం కనిపిత్తుందో ?” అని అడిగింది.
రాజయ్య భార్యవైపు చూడకుండా “చెప్పినా నీకు తెలవదులే” అన్నాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఏరుముందా ? యేరో పౌర్ణం ముందా? అనుకుంటూ నిలబడ్డాడు రాజయ్య. నిన్న మంటలు జిమ్మిన సూరీడు మళ్ళీ రాబోతున్నాడు. సముద్రపు గాలికి ఇంటి ముందున్న వేపచెట్టు తల ఆడిస్తోంది.
రాజయ్య గూడెంలో పెత్తందారు. మాటా మంచీ వున్న మనిషి. అంటరాని వాడిగా అగ్రవర్ణాలవారు 'రాజిగా' అని పిలిస్తే ఆ పిలుపులో వున్న దోషం అతనికి తెలియదు. అలవాటైపోయిన ఆ పిలుపును కాదని ఎవరైనా 'రాజయ్యా !' అంటే ఏదో ప్రమాదం వచ్చినట్టుంటుంది.
ఎదురుగా కృష్ణా నదిలో సన్నజాలు వంకరలు తిరిగి నడుస్తోంది. వయ్యారాలు పోతూ నడుస్తోంది, ఉరకలేస్తూ నడుస్తోంది.
చిన్న పిల్లలు పాకుతున్నట్టు కదులుతోంది. రాజయ్య నది వంక చూసి తనలో తాను నవ్వుకున్నాడు. వేపమండ విరిచి ఆకులూ, ఈ నెలూ తీసివేశాడు. ముఖంపుల్ల నోట్లో పెట్టుకుని, నములుతూ నది వంకే చూస్తున్నాడు.
“ఇయ్యేడు యేరే ముందొచ్చేత్తుందనుకుంటా” నంటూ రాజయ్య భార్య రమణమ్మ మొగుడి పక్కకొచ్చి నిలబడింది. రాజయ్య మాట్లాడలేదు. నదివంకే చూస్తూ నిలుచున్నాడు.