ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్‌గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంతమంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు. ఒక పబ్లిషర్‌గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్. స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీవాక్యం ఒక వండరలా తోస్తుంది.
వెంకట్ శిద్దారెడ్డి రచయిత, సినీ దర్శకులు
ఒక రచయితగా సాటి రచయితలు ఏం రాస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తిగా చూస్తుంటాను. ఒక పబ్లిషర్‌గా కొత్త రచయితలు ఎవరున్నారా అని అన్వేషిస్తూనే ఉంటాను. రచయితగా స్వరూప్ వాక్యం చదివి ఈర్ష్య కలిగింది. తెలుగులో కన్సిస్టెంట్ గా ఇంతమంచి వాక్యం రాసే రచయితను నేనైతే ఇంతవరకూ చూడలేదు. ఒక పబ్లిషర్‌గా స్వరూప్ అనే రచయితను కనుక్కోవడం ఒక యురేకా మొమెంట్. స్వరూప్ ఫేస్ బుక్ లో రాసిన మ్యూజింగ్స్ ని పబ్లిష్ చేయడం ఆన్వీక్షికి ప్రచురణాలయానికి ఒక గర్వకారణం. స్వరూప్ రాతలు చదువుతుంటే అతను ఏమేం పుస్తకాలు చదువుతుంటాడో అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఫేస్ బుక్ లో పోస్ట్ రాసే ముందు అతనేం తింటాడో, తాగుతాడో అని క్యూరియస్ గా ఉంటుంది. అసలు అతను జీవితాన్ని, ప్రపంచాన్ని చూసే కళ్ళని కొన్ని రోజులు అద్దెకు తీసుకోవాలనిపిస్తుంది. స్వరూప్ మ్యూజింగ్స్ చదవడమంటే తెలుగు భాషను కొత్తగా డిస్కవర్ చేసినట్టుంటుంది. ఎప్పుడైనా కథలో ఎక్కడో ఒక చోట ఒక మంచి అబ్జర్వేషన్ ని రాసి శభాష్ అని భుజం తట్టుకుంటుంటాం. కానీ స్వరూప్ ప్రతీవాక్యం ఒక వండరలా తోస్తుంది. వెంకట్ శిద్దారెడ్డి రచయిత, సినీ దర్శకులు© 2017,www.logili.com All Rights Reserved.