విశ్వనాథ - శ్రీరమణ - నేను
- డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి
ఛైర్మన్, విశ్వనాథ సాహిత్య అకాడమి
70229 66895
సమకాలీన సాహిత్యం, కథలు, వార్తాపత్రికలు, కాలమ్స్ చదివే అలవాటు బొత్తిగా లేని నాకు 2010 వరకూ శ్రీరమణగారు తెలియకపోవటం వింతేమీ కాదు. 2010లో బొంబాయిలో మిత్రుడి ఇంట్లో మూణెల్లు ఉన్నా. మా అమ్మానాన్నల అన్యోన్యత మాటల్లో వచ్చినప్పుడు, మా మిత్రుడి తల్లి అంటూండేది, “కౌటిల్యవాళ్ళ అమ్మానాన్నా మిథునం జంటరా” అని. దానికి నా క్వశ్చన్మార్కు ఫేసు చూసి మావాడు, “శ్రీరమణ అని ఒక కథారచయిత ఉన్నారే, ఆయన రాసిన కథ 'మిథునం.' చదువు, బావుంటుంది” అన్నాడు. తెలుగుపీపుల్. కామ్ అప్పట్లో పబ్లిష్ అయ్యి ఉన్న కథని ప్రింటు తీసి ఇచ్చాడు. గంటలో గబగబా చదివా. మళ్ళా నింపాదిగా ఇంకో నాలుగు సార్లు చదివాను. నచ్చింది. అలా రచయిత కళ్ళల్లోంచి చెప్పుకొచ్చే కథనం నాకు బాగా ఇష్టం. పాఠకుణ్ణి తనతోపాటు నడిపించుకెళ్ళగలిగే ప్రతిభ చాలా కొద్దిమందికి ఉంటుంది. విశ్వనాథది అదే స్కూలు..............
విశ్వనాథ - శ్రీరమణ - నేను - డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి ఛైర్మన్, విశ్వనాథ సాహిత్య అకాడమి 70229 66895 సమకాలీన సాహిత్యం, కథలు, వార్తాపత్రికలు, కాలమ్స్ చదివే అలవాటు బొత్తిగా లేని నాకు 2010 వరకూ శ్రీరమణగారు తెలియకపోవటం వింతేమీ కాదు. 2010లో బొంబాయిలో మిత్రుడి ఇంట్లో మూణెల్లు ఉన్నా. మా అమ్మానాన్నల అన్యోన్యత మాటల్లో వచ్చినప్పుడు, మా మిత్రుడి తల్లి అంటూండేది, “కౌటిల్యవాళ్ళ అమ్మానాన్నా మిథునం జంటరా” అని. దానికి నా క్వశ్చన్మార్కు ఫేసు చూసి మావాడు, “శ్రీరమణ అని ఒక కథారచయిత ఉన్నారే, ఆయన రాసిన కథ 'మిథునం.' చదువు, బావుంటుంది” అన్నాడు. తెలుగుపీపుల్. కామ్ అప్పట్లో పబ్లిష్ అయ్యి ఉన్న కథని ప్రింటు తీసి ఇచ్చాడు. గంటలో గబగబా చదివా. మళ్ళా నింపాదిగా ఇంకో నాలుగు సార్లు చదివాను. నచ్చింది. అలా రచయిత కళ్ళల్లోంచి చెప్పుకొచ్చే కథనం నాకు బాగా ఇష్టం. పాఠకుణ్ణి తనతోపాటు నడిపించుకెళ్ళగలిగే ప్రతిభ చాలా కొద్దిమందికి ఉంటుంది. విశ్వనాథది అదే స్కూలు..............© 2017,www.logili.com All Rights Reserved.