Title | Price | |
Enki Patalu | Rs.40 | In Stock |
Enkipatalu | Rs.120 | In Stock |
- ఎమెస్కో విజయకుమార్
ఎంకిపాటలు స్వచ్చమైన స్ఫటిక సదృశమైన గ్రామీణ యువతీయువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. శ్రీ సుబ్బారావుగారు పల్లెజీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయసౌరభాలని ఎంకి నాయుడుబావ పాత్రలతో ఈ పాటల ద్వారా మనకందించారు. గుండె గొంతుకలోన కొట్లాడతాదని తన కవితాయాత్రను ప్రారంభించాడు కవి. ‘ఒక్కనేనే నీకు’, పెక్కు నీవు నాకు’, ‘యెనక జన్మములోన యెవరమోనంటి’ ‘కలయో తెలుపు మన మనసులు కలయికల నిజానిజాల’, ‘కళ్ళెత్తితే సాలు కనకాభిసేకాలు’, అద్దమేలంటాది అందాలు తెలప వంటి అద్భుత భావ ప్రకటనల సమాహారం ఈ ఎంకిపాటలు! ఎంకిని నాయుడు బావని సజీవ చిత్రాలుగా నండూరి వారి ఎంకి సృష్టిస్తే, కళాభాస్కర్ కుంచె ఆ అక్షరాలను పట్టుకుని బొమ్మలుగా మార్చింది. ఈ పుస్తకం రూపుదిద్దుకోవడానికి సహకరించిన మిత్రుడు, చిత్రకారుడు ఉత్తమ్ కి, స్టార్ మీడియా సర్వీసెస్ సంస్థ నిర్వాహకురాలు జయంతికి, ఈ బొమ్మల హక్కులను అందించిన ఎం సుధీంద్ర కి, అడగానే ఎంకిపాటల పుస్తకాన్ని నాకు పంపించిన నవరత్న రవికి కృతఙ్ఞతలు. - ఎమెస్కో విజయకుమార్© 2017,www.logili.com All Rights Reserved.