20 వ శతాబ్దం మూడవ దశకంలో భావకవిత్వం పొంగులు ఎత్తిన రోజుల్లో నండూరి సుబ్బారావు ఎంకిపాటలు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు "సముద్రంలో నుంచి మంచుకొండలు లేచి వచ్చినట్లుగా" ఉబికి వచ్చినాయి. ఎంకి పాటలు రసస్ఫూర్తి కలిగిన ఖండకావ్యం అయింది. కిన్నెరసాని పాటలు రసవంతమైన మహాకావ్యంగా రూపొందింది. ఒక కథను ఆశ్రయించి రస ఉద్విగ్నంగా, భావుక తర్పణంగా వచ్చిన మహాకావ్యం కిన్నెరసాని పాటలు. దీనికి పూర్వం వచ్చిన అబ్బూరి వారి నదీసుందరి కానీ, అంతకుముందు వచ్చిన వసుచరిత్రలోని కథ శుక్తిమతి కథ కానీ నది లక్షణానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించదు.