సమాజాన్ని, చరిత్రను, సంస్కృతిని స్త్రీల కోణం నుండి విశ్లేషించే వినూత్న చైతన్యాన్ని 1980 దశకం నాటి స్త్రీవాదం కల్పించింది. ఎందరో స్త్రీవాద రచయిత్రులు మరియు కవయిత్రులు ప్రతిభావంతమైన వ్యక్తీకరణలతో దూసుకొచ్చారు. అలాగే గురజాడ, చలం, శ్రీపాద, కొడవగంటి మొదలైన పురుష రచయితల "స్త్రీవాద స్పృహ" తర్వాతతరం కవుల పైన, కథారచయితల పైన, నవలా రచయితల పైన, నాటక రచయితలు పైన కనబదుతున్నది. అయితే వీరిలో మచ్చుకు కొందరు రచయితల రచనల్ని తీసుకోని పురుష రచయితల సాహిత్యంలో వ్యక్తమైన స్త్రీవాద ధోరణిని ఒడుపుగా డాక్టర్ సి హెచ్ సుశీలమ్మ ఈ రీసెర్చ్ ప్రాజెక్టులో విశ్లేషించారు . కళాశాలల్లో , విశ్వవిద్యాలయాల్లో ప్రామాణికమైన పరిశోధనలు జరగడం లేదన్న అభియోగానికి ఈ పరిశోధన ఒక సముచిత సమాధానంగా ఉంది. చాలా లోతైన అంశాలను సరళ సుందరమైన తెలుగులో చదివింప చేయగల శైలిలో సులభగ్రాహ్యంగా ఈ గ్రంథంలో వెలువరించిన సుశీలమ్మకు హృదయపూర్వక అభినందనలు.