తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తన జీవితకాలంలోనే కాక ఈనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా ఇన్ని లలిత గీతాలు, పద్యాలు ఆలపించారని నేటి తరంలో చాలామందికి తెలియదు. వారు పాడిన చిత్రగీతాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన పరమపదించినప్పటి నుంచి గాయనీగాయకులందరూ ఆయన చిత్రాలలో పాడినవీ, స్వరపరిచినవీ ఎక్కువగా పాడుతుంటారు.
మరి ఘంటసాల గారి చిత్రేతర భక్తిగీతాలు, పద్యాలు, యక్షగానాలు, బుర్రకథలు, అష్టపదులు, లలితగీతాలు మున్నగువాటి గురించి ఈ తరం వారికి అందించాలనే సత్సంకల్పంతో డా. కె. వి. రావుగారి రూపకల్పనతో సంగీత సాహిత్యాలలో విధ్వన్మణులు శ్రీ డా. ఎం. పురుషోత్తమాచార్యుల వారు సమతుల్యమైన విశ్లేషణతో రూపొందించిన "మన ఘంటసాల సంగీత వైభవం" అనే బృహద్గ్రంథమిది.
తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు తన జీవితకాలంలోనే కాక ఈనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి. ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా ఇన్ని లలిత గీతాలు, పద్యాలు ఆలపించారని నేటి తరంలో చాలామందికి తెలియదు. వారు పాడిన చిత్రగీతాలు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన పరమపదించినప్పటి నుంచి గాయనీగాయకులందరూ ఆయన చిత్రాలలో పాడినవీ, స్వరపరిచినవీ ఎక్కువగా పాడుతుంటారు. మరి ఘంటసాల గారి చిత్రేతర భక్తిగీతాలు, పద్యాలు, యక్షగానాలు, బుర్రకథలు, అష్టపదులు, లలితగీతాలు మున్నగువాటి గురించి ఈ తరం వారికి అందించాలనే సత్సంకల్పంతో డా. కె. వి. రావుగారి రూపకల్పనతో సంగీత సాహిత్యాలలో విధ్వన్మణులు శ్రీ డా. ఎం. పురుషోత్తమాచార్యుల వారు సమతుల్యమైన విశ్లేషణతో రూపొందించిన "మన ఘంటసాల సంగీత వైభవం" అనే బృహద్గ్రంథమిది.© 2017,www.logili.com All Rights Reserved.