కొండపల్లి కోట నిర్మాణానికి సంబంధించిన, కొన్ని కథలు, గాధలు కొండపల్లి కోట చుట్టూ అల్లుకుపోయాయి. రెండు కథలు రెడ్డిరాజుల కాలంనాటివైతే, మరోటి బహమనీ సుల్తానుల కాలంనాటిది.
ప్రచారంలోనున్న ఒక కథప్రకారం , ఒక బ్రాహ్మణుడు కాశీ చూడాలన్న తపనతో అడవులగుండా ప్రయాణమైనాడు. నడచి, నడచి సువర్ణ నది తీరానికి చేరుకొన్నాడు.అతడక్కడ విశ్రాంతి తీసుకొనే సమయంలో , దేన్నైనా బంగారంగా మార్చే పరుసవేది అతని కంటబడింది. ఆ బ్రాహ్మణుడు ఆ పరుసవేదిని రెండు ఎండుసొరకాయబుర్రల్లో నింపుకొని తిరుగు ప్రయాణమైనాడు. అతడు కొండపల్లికి తూర్పుగానున్న కవులూరు అనే గ్రామానికి చేరుకొనేటప్పటికీ రాత్రి అయింది . ఆ వూరిలోనే ఉన్న వేమారెడ్డి అనే ఆసామి, ఆ బ్రాహ్మణునికి ఆతిధ్యామిచ్చి, పశువుల కొట్టంలో విడిది ఏర్పాటుచేశాడు.