ఇన్నాళ్ళు నేను కూడా అందరితో పాటే ఒక తప్పుడు అభిప్రాయంతోనే ఉన్నాను. అది ఏమిటంటే మన చలన చిత్ర సంగీత దర్శకులు కర్ణాటక సంగీత విద్వాంసుల కంటే ఒక మెట్టు తక్కువ ప్రతిభ కలవాళ్ళు అనేది. అయితే జగదేకవీరుని కథ సినిమాలో దర్బారీ కానడ రాగంలో పెండ్యాల నాగేశ్వర రావు గారిచే స్వరపరచబడిన 'శివశంకరీ' పాట నిశితంగా విన్న తర్వాత నా అభిప్రాయం తప్పు అని అర్థం అయింది. హిందుస్తానీ రాగం అయినా తెలుగు పాటలో పెండ్యాల గారు ఎంత అద్భుతంగా మెట్లు కట్టారో? రాగ స్వరూపం మొత్తం పొదిగారు. దానికి తగ్గట్టుగా ఘంటసాల మాస్టారు గారి గాత్ర ధారణ, ఎన్టీఆర్ గారి పాత్ర పోషణ ఆ పాటను చిరస్థాయిగా నిలిపాయి.
- డా. కోదాటి సాంబయ్య
సంగీత సాహిత్య రసజ్ఞులకు సమస్సుమాంజలులు....