ప్రకృతికి, ధ్వనికి అవిభావన సంబంధం ఉంది. శబ్దంతోనే ఈ విశ్వావిర్భావం జరిగిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే వారు, ధ్వని మీద చాలా ప్రయోగాలు - పరిశోధనలు చేశారు. ప్రాచీన ధ్వని విశేషజ్ఞులు, సంగీతంలో నిండిన 'శక్తి' ని తమతమ పద్ధతుల్లో పరిశీలించారు. విభిన్న రాగాలు ప్రస్తారించారు. కొన్ని రాగాల్ని సమయానుసారంగా విభజించారు. ప్రాతఃకాల రాగాలు, మధ్యాహ్న రాగాలు, సాయంకాల రాగాలు, రాత్రి రాగాలు ఇలా... ఇవి ఆయా వేళల్లో ఆలాపించడం వల్ల మానవుల మనస్సుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి.
అయితే - ఈ ధ్వనులన్నింటికీ మూలం - 'ఓం'కారమే! అందుండియే ఈ ధ్వనులన్నీ జన్మించాయి. అంతేనా? ఈ ప్రపంచంలో వ్యాపించిన ధ్వనులన్నింటికీ ఉత్పత్తి స్థానం... ఓంకారం ఒక్కటే! అది లోపలా, వెలుపలా అంతటా వ్యాపించి ఉంది. పంచభూతాల్లో నిండి ఉంది.
ప్రకృతికి, ధ్వనికి అవిభావన సంబంధం ఉంది. శబ్దంతోనే ఈ విశ్వావిర్భావం జరిగిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే వారు, ధ్వని మీద చాలా ప్రయోగాలు - పరిశోధనలు చేశారు. ప్రాచీన ధ్వని విశేషజ్ఞులు, సంగీతంలో నిండిన 'శక్తి' ని తమతమ పద్ధతుల్లో పరిశీలించారు. విభిన్న రాగాలు ప్రస్తారించారు. కొన్ని రాగాల్ని సమయానుసారంగా విభజించారు. ప్రాతఃకాల రాగాలు, మధ్యాహ్న రాగాలు, సాయంకాల రాగాలు, రాత్రి రాగాలు ఇలా... ఇవి ఆయా వేళల్లో ఆలాపించడం వల్ల మానవుల మనస్సుపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అయితే - ఈ ధ్వనులన్నింటికీ మూలం - 'ఓం'కారమే! అందుండియే ఈ ధ్వనులన్నీ జన్మించాయి. అంతేనా? ఈ ప్రపంచంలో వ్యాపించిన ధ్వనులన్నింటికీ ఉత్పత్తి స్థానం... ఓంకారం ఒక్కటే! అది లోపలా, వెలుపలా అంతటా వ్యాపించి ఉంది. పంచభూతాల్లో నిండి ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.