ఆ ఊరు పేరు మైలవరం. దాదాపు యైభై గడపల వరకు ఇళ్ళు ఉంటాయి. అక్కడ నివసించేవారి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆ రోజులలో పంటలు పండే ఊర్లనే లెక్కలోకి తీసుకొని అనాటి గ్రామాధికారులు పన్నులు రైతుల దగ్గర నుంచి వసూలు చేసి ఇంగ్లీషు పాలకులకు చెల్లించేవారు. మైలవరంలో పెద్దగా పంటలు పండవు. ఆ ఊరికి చెరువు క్రింద మాగాణి సాగు చేసి వరి పండించేవారు ఒక సంవత్సరం విపరీతమైన వర్షాల కారణంగా ఎక్కువ నీరు చెరువుకు చేరి బలహీనమైన దాని కట్ట తెగిపోయింది. దాని మూలంగా మాగాణి బీడుపడ్డది. అందుకని ప్రధానంగా ఆ ఊరివారు మెట్ట పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు వరిగెలు, కొర్రలు, పండించేవారు. పప్పు ధాన్యాలు కందులు, పెసలు, అలచందలు పెంచేవారు. వాణిజ్య పంటలు నువ్వులు, ఆముదాలు, పొగాకు బాగా ఎక్కువ భూములు ఉన్నవారు పండించి ప్రక్కనే ఉన్న పట్టణాలకు ఎద్దుల బండ్లపై తీసుకొనిపోయి అమ్మేవారు.
ఆ ఊరిలో ఒక బ్రహ్మణ కుటుంబం ఉన్నది. ఆ ఇంటి యాజమాని పేరు బుచ్చయ్యశాస్త్రి గారు. వారి భార్య కామాక్షమ్మ. ఆ ఊరి పురోహితులు. వారి పూర్వీకులు తెలంగాణ ప్రాతం నుంచి అక్కడకు వలస వచ్చారు. కాకతీయ సామ్రాజ్యం పతనమై నవాబుల పాలన ప్రారంభమయినది. క్రీస్తు శకము 1323 సెప్టెంబర్లో ఉలుగ్ ఖాన్ ఓరుగల్లును అక్రమించుకున్నడు అప్పుడు ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో హిందువులు చంపబడ్డారు. తరువాత పెద్ద ఎత్తున మత మార్పిడులు జరిగినవి. భయపెట్టి బెదిరించి, హిందుసమాజంలోని అన్ని కులములవారిని ముస్లిమ్ మతంలోకి మార్చటం మొదలయింది. ఈ అరాచకాలను ఎదురించిన ఎంతోమందిని నిర్ధాక్షణ్యముగా చంపడం..........................
|| అలనాటి వేయి గడపలు NI 1 జన్నాభట్ల నరసింహప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.